Rajeshwar Reddy
-
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్‌కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
ఏపీఎస్డీఆర్ఐ స్పెషల్ కమిషనర్‌గా రాజేశ్వర్‌రెడ్డి నియామకం
సాక్షి, విజయవాడ: స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీఎస్డీఆర్ఐ) స్పెషల్ కమిషనర్‌గా రాజేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయనతోపాటు ఆంధప్రదేశ్ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీగా దీవన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు -
కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం
పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు కూడా తిరిగి రాక నాలుగేళ్ల వ్యవసాయంలో ఐదెకరాల భూమి అమ్మి తీర్చినా ఇంకా మిగిలిన రూ. 8 లక్షల అప్పులు యువ రైతు ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26)ని బలిగొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) అనే యువరైతు అప్పుల బాధతో ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సకాలంలో వర్షాలు కురవక సాగు చేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరలేదు. నాలుగేళ్లలో చేసిన అప్పులు తలకు మించి భారమయ్యాయి. రెండేళ్ల క్రితం సొంత భూమి 5 ఎకరాలు అమ్మేసినా అప్పులు తీరలేదు. రెండేళ్ల నుంచి 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న–12, ఉల్లి–5, మినుములు–5 ఎకరాల్లో పంటలు సాగు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మొత్తంగా రూ.8 లక్షలకు పైగా అప్పులు మిగిలాయని, ప్రైవేటు ఫైనాన్స్‌లో బంగారు రుణం కింద రూ. 2.50 లక్షలు తీసుకున్నట్లు రాజేశ్వరరెడ్డి భార్య భాగ్యలక్ష్మి తెలిపారు. అప్పులకు వడ్డీలు పెరిగి తలకుమించిన భారంగా మారుతున్నాయని బాధపడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకున్నా, తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. దినసరి కూలీగా మారి మూడేళ్ల కుమార్తెను పోషించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. – ఎస్. నగేష్, నందికొట్కూరు, కర్నూలు జిల్లా -
‘సెట్’కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అర్హత పరీక్ష (టీఎస్, ఏపీ సెట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15న జరిగే సెట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమన్నారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాలు అన్నీ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వికలాంగులు, పరీక్షలు రాయలేని వారు పరీక్ష స్క్రైబ్ కోసం వారం రోజుల ముందే పరీక్షా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. -
కసరత్తులు
ఒక వైపు చోటాల బెడద. మరోవైపు ఎవరికి వారు. పట్టుకోసం మరో పక్షం. వలసలతో ‘సల..సల’ లాడుతున్న మరో పార్టీ. తొలిసారి గురిపెట్టి బరిలో సత్తా చూపుకోవాలని ఇంకో పక్షం ఉరుకులు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ‘మున్సిపలీయం’లో రకరకాల ఎత్తులతో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు గట్టి కృషిచేస్తున్నాయి. బలాలు బేరీజు వేసుకుంటూ పావులు కదుపుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు కత్తిమీద సాములా తయారైంది. రిజర్వేషన్ల మూలంగా కొన్ని వా ర్డుల్లో పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారు. టికె ట్ల కోసం తీవ్ర పోటీ ఉన్న చోట చోటా మోటా నేతలు సిగపట్లకు దిగుతున్నారు. దీంతో అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు అన్ని పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. అభ్యర్థులు దొరకని చోట ఇతర పార్టీల్లోని అసంతృప్తులు వస్తారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎంపికను పార్టీ అధిష్టానాలు స్థానిక నేతలకు అప్పగించడంతో జాబితా ఖరారు చేయలేక తలపట్టుకుంటున్నారు. నామినేషన్ల దాఖులకు శుక్రవారం చివరి గడువు కావడంతో గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించాలని పార్టీలు యోచిస్తున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో పరిస్థితి ఇదీ. కాంగ్రెస్‌లో ఎవరికి వారు.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థుల వడపోతపై కసరత్తు చేస్తున్నారు. షాద్‌నగర్‌లో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తోంది. కల్వకుర్తిలో వంశీచంద్, చిత్తరంజన్‌దాస్, జైపాల్‌రెడ్డి వర్గీయులు ఎవరికి వారుగా జాబితాలు సిద్దం చేసుకుంటున్నారు. నారాయణపేటలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నాగర్‌కర్నూలులో జడ్పీ మాజీ చైర్మన్ దామోదర రెడ్డి జాబితా సిద్దం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మోహన్‌గౌడ్ భార్య వెంకటలక్ష్మమ్మను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రత్యక్షంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఐజలో ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థుల జాబితాను 14న విడుదల చేస్తామని ప్రకటించారు. పాగాకు టీఆర్ఎస్ వ్యూహం.. చేరికలను ప్రోత్సహించడం ద్వారా మున్సిపాలిటీల్లో పాగా వేయాలని టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో టీజీఓ నేత శ్రీనివాస్‌గౌడ్‌ను నియోజకవర్గ ఇంచార్జిగా ప్రకటించడం, ఇబ్రహీంను పక్కన పెట్టడం, టీడీపీ నుంచి రాజేశ్వర్‌గౌడ్ చేరిక వంటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటి వరకు 24 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. షాద్‌నగర్‌లో అభ్యర్థుల కొరత పీడిస్తోంది. కల్లకుర్తిలో ఆనంద్‌కుమార్ అనే టీడీపీ నేత చేరికపై ఆశలు పెట్టుకుంది. నారాయణపేటలో పార్టీలో కొత్తగా చేరిన శివకుమార్ రెడ్డి అభ్యర్థుల జాబితా సిద్దం చేసి పార్టీ అధిష్టానం పరిశీలనకు పంపినట్లు తెలిసింది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ శరత్‌బాబు చేరికతో టీఆర్ఎస్ మున్సిపల్ పీఠంపై ఆశలు పెంచుకుంది. వనపర్తిలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి జాబితాపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇటీవల మాజీ జడ్పీటీసీ తిరుమల్‌రెడ్డి, శ్రీధర్ పార్టీలో చేరడంతో ఐజ నగర పంచాయతీలో ప్రధాన పోటీదారుగా టీఆర్ఎస్ కనిపిస్తోంది. పట్టు నిలుపుకునే పనిలో కమల దళం.. మహబూబ్‌నగర్ మున్సిపాలి టీ లో పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో కొన్ని వార్డుల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ వుంది. 23 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు. షాద్‌నగర్ అన్ని వార్డుల్లో పోటీలో నిలిపేందు కు ప్రయత్నిస్తున్నారు. కల్వకుర్తిలో బీజేపీ పోటీ నామమాత్రం కానున్నది. నారాయణపేట మున్సిపాలిటీకి గతంలో మూడు పర్యాయాలు బీజేపీ ప్రాతినిధ్యం వహించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండు రెడ్డి, నాగూరావు నా మాజి జాబితా సిద్దం చేస్తున్నారు. నాగర్‌కర్నూ లు మున్సిపాలిటీని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. వనపర్తిలోనూ గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. ఐజలో బీజేపీ కొన్ని వార్డుల్లో పో టీకి పరిమితయ్యే సూచన కనిపిస్తోంది. ‘పొత్తు’ పొడుపుపై ‘దేశం’ ఆశలు ఎనిమిది మంది సిట్టింగ్ ఎ మ్మెల్యేలు ఉన్నా వలసలతో పార్టీ పునాదులు కదులుతున్నాయి. షాద్‌నగర్ నగర పంచాయతీ మినహా మిగతా చోట్ల పార్టీ అభ్యర్థుల పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో బీజేపీతో పొత్తు కుదురుతుందనే ఆశ కనిపిస్తోంది. కల్వకుర్తిలో ఓ నేత పార్టీలో వుంటేనే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. నారాయణపేటలో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో కేడర్ చెల్లా చెదురైంది. నాగర్‌కర్నూలు, ఐజలో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. అనకూలతకోసం..వీరు ఇక మిగిలిన ఎఐఎంఐఎం, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా తదితర పార్టీలు అనుకూలమైన చోట అభ్యర్థులను బరిలో దించుతున్నాయి. -
అభ్యర్థులు ‘అప్సెట్’
=సకాలంలో సెంటర్లకు చేరుకోలేక అవస్థలు =ఏపీసెట్‌కు గ్రేటర్‌లోనే సుమారు =10వేలమంది దూరం =శివార్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడమే కారణం ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీసెట్-2013) పరీక్ష నగర అభ్యర్థులకు తీరని నిరాశను మిగిల్చింది. నగరంలోని కాలేజీలను వదిలేసి శివారు ప్రాంతాల్లో దూరంగా కాలేజీల్లో సెంటర్లు కేటాయించడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతాల్లోని వృత్తివిద్యా కాలేజీల్లో పరీక్ష నిర్వహించడం వల్ల రూట్‌మ్యాప్ తెలియక చాలామంది సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ట్రాఫిక్ వలయాన్ని ఛేదించుకొని సిటీకి ఎటూ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రాలకు చేరుకునే సమయానికి తీరా సమయం ముగియడంతో నిరాశతో వెనుతిరుగాల్సి వచ్చింది. ఒక్క నగరం నుంచే ఏపీసెట్‌కు మొత్తం 35,289 అభ్యర్థుల పరీక్షకు దరఖాస్తు చేసుకోగా,వీరిలో 25,827 మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల ఎంపికపై అధికారులకు ముందుచూపు లేకపోవడంతో గర్భిణులు, బాలిం తలు, అంధులు, వికలాంగులు నానాఇబ్బం దులు పడ్డారు. కార్పొరేట్‌స్థాయి హంగులతో కూడిన పా ఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఉన్నా.. వాటిని కాదని దూరంగా ఉన్న గండిపేట, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంబాగ్, ఆర్సీఐ, తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో కష్టపడి చదివిన అభ్యర్థులు పరీక్ష రాయక కన్నీళ్లు పెట్టుకొని వెనుదిరిగారు. రైల్వే పరీక్ష వల్లే : ఏపీసెట్ నోటిఫికేషన్‌కు ముందే నగరంలోని పలు కళాశాలలు,పాఠశాలలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ముందుగా రిజర్వు చేసుకుందని, దీంతో శివా రు ప్రాంతాల్లోని కాలేజీలను ఎంపిక చేయాల్సి వచ్చిందని ఏపీసెట్ 2013 సభ్యకార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. 15 రోజుల ముందే హాల్‌టికెట్లను పంపిణీ చేశామని చెప్పారు. -
ఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఏపీసెట్-13 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రాసేందుకు సహాయకులు అవసరమైన వికలాంగ, అంధ అభ్యర్థులు తమ వివరాలను వారం రోజులు ముందుగా తెలియజేస్తే స్క్రైబ్స్‌ను ఏర్పాటు చేస్తామని ఏపీసెట్ కార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడు విభాగాలుగా జరిగే పరీక్షకు 1,26,785 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, తెలుగు, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులకు అభ్యర్థులు ఎక్కువగా ఉంటే.. జాగ్రఫీలో అతి కొద్ది మంది మాత్రమే పరీక్ష రాయబోతున్నారు. సజావుగా పరీక్షరాసేందుకు అభ్యర్థులకు రాజేశ్వర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ‘మూడు విభాగాలుగా జరిగే పరీక్షలో మొదటి పేపర్లో 60 ప్రశ్నలకు 50 రాయాలి. కాబట్టి అభ్యర్థులు కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే జవాబులివ్వాలి. ఇప్పటికీ హాల్ టికెట్లు అందని, స్క్రైబ్స్ అవసరమైన అభ్యర్థులు తమ వివరాలను 040 27097733 నంబరుకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. apset2012 @gmail.com ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు’ అని సూచించారు.