ఒక వైపు చోటాల బెడద. మరోవైపు ఎవరికి వారు. పట్టుకోసం మరో పక్షం. వలసలతో ‘సల..సల’ లాడుతున్న మరో పార్టీ. తొలిసారి గురిపెట్టి బరిలో సత్తా చూపుకోవాలని ఇంకో పక్షం ఉరుకులు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ‘మున్సిపలీయం’లో రకరకాల ఎత్తులతో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు గట్టి కృషిచేస్తున్నాయి. బలాలు బేరీజు వేసుకుంటూ పావులు కదుపుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు కత్తిమీద సాములా తయారైంది. రిజర్వేషన్ల మూలంగా కొన్ని వా ర్డుల్లో పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారు. టికె ట్ల కోసం తీవ్ర పోటీ ఉన్న చోట చోటా మోటా నేతలు సిగపట్లకు దిగుతున్నారు. దీంతో అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు అన్ని పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. అభ్యర్థులు దొరకని చోట ఇతర పార్టీల్లోని అసంతృప్తులు వస్తారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎంపికను పార్టీ అధిష్టానాలు స్థానిక నేతలకు అప్పగించడంతో జాబితా ఖరారు చేయలేక తలపట్టుకుంటున్నారు. నామినేషన్ల దాఖులకు శుక్రవారం చివరి గడువు కావడంతో గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించాలని పార్టీలు యోచిస్తున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో పరిస్థితి ఇదీ.
కాంగ్రెస్‌లో ఎవరికి వారు..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థుల వడపోతపై కసరత్తు చేస్తున్నారు. షాద్‌నగర్‌లో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తోంది. కల్వకుర్తిలో వంశీచంద్, చిత్తరంజన్‌దాస్, జైపాల్‌రెడ్డి వర్గీయులు ఎవరికి వారుగా జాబితాలు సిద్దం చేసుకుంటున్నారు.
నారాయణపేటలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నాగర్‌కర్నూలులో జడ్పీ మాజీ చైర్మన్ దామోదర రెడ్డి జాబితా సిద్దం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మోహన్‌గౌడ్ భార్య వెంకటలక్ష్మమ్మను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రత్యక్షంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఐజలో ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థుల జాబితాను 14న విడుదల చేస్తామని ప్రకటించారు.
పాగాకు టీఆర్‌ఎస్ వ్యూహం..
చేరికలను ప్రోత్సహించడం ద్వారా మున్సిపాలిటీల్లో పాగా వేయాలని టీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో టీజీఓ నేత శ్రీనివాస్‌గౌడ్‌ను నియోజకవర్గ ఇంచార్జిగా ప్రకటించడం, ఇబ్రహీంను పక్కన పెట్టడం, టీడీపీ నుంచి రాజేశ్వర్‌గౌడ్ చేరిక వంటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటి వరకు 24 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. షాద్‌నగర్‌లో అభ్యర్థుల కొరత పీడిస్తోంది. కల్లకుర్తిలో ఆనంద్‌కుమార్ అనే టీడీపీ నేత చేరికపై ఆశలు పెట్టుకుంది.
నారాయణపేటలో పార్టీలో కొత్తగా చేరిన శివకుమార్ రెడ్డి అభ్యర్థుల జాబితా సిద్దం చేసి పార్టీ అధిష్టానం పరిశీలనకు పంపినట్లు తెలిసింది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ శరత్‌బాబు చేరికతో టీఆర్‌ఎస్ మున్సిపల్ పీఠంపై ఆశలు పెంచుకుంది. వనపర్తిలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి జాబితాపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇటీవల మాజీ జడ్పీటీసీ తిరుమల్‌రెడ్డి, శ్రీధర్ పార్టీలో చేరడంతో ఐజ నగర పంచాయతీలో ప్రధాన పోటీదారుగా టీఆర్‌ఎస్ కనిపిస్తోంది.
పట్టు నిలుపుకునే పనిలో కమల దళం..
మహబూబ్‌నగర్ మున్సిపాలి టీ లో పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో కొన్ని వార్డుల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ వుంది. 23 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు. షాద్‌నగర్ అన్ని వార్డుల్లో పోటీలో నిలిపేందు కు ప్రయత్నిస్తున్నారు. కల్వకుర్తిలో బీజేపీ పోటీ నామమాత్రం కానున్నది.
నారాయణపేట మున్సిపాలిటీకి గతంలో మూడు పర్యాయాలు బీజేపీ ప్రాతినిధ్యం వహించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండు రెడ్డి, నాగూరావు నా మాజి జాబితా సిద్దం చేస్తున్నారు. నాగర్‌కర్నూ లు మున్సిపాలిటీని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. వనపర్తిలోనూ గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. ఐజలో బీజేపీ కొన్ని వార్డుల్లో పో టీకి పరిమితయ్యే సూచన కనిపిస్తోంది.
‘పొత్తు’ పొడుపుపై ‘దేశం’ ఆశలు
ఎనిమిది మంది సిట్టింగ్ ఎ మ్మెల్యేలు ఉన్నా వలసలతో పార్టీ పునాదులు కదులుతున్నాయి. షాద్‌నగర్ నగర పంచాయతీ మినహా మిగతా చోట్ల పార్టీ అభ్యర్థుల పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో బీజేపీతో పొత్తు కుదురుతుందనే ఆశ కనిపిస్తోంది. కల్వకుర్తిలో ఓ నేత పార్టీలో వుంటేనే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. నారాయణపేటలో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో కేడర్ చెల్లా చెదురైంది. నాగర్‌కర్నూలు, ఐజలో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు.
అనకూలతకోసం..వీరు
ఇక మిగిలిన ఎఐఎంఐఎం, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా తదితర పార్టీలు అనుకూలమైన చోట అభ్యర్థులను బరిలో దించుతున్నాయి.
కసరత్తులు
Published Thu, Mar 13 2014 3:48 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement