సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అర్హత పరీక్ష (టీఎస్, ఏపీ సెట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15న జరిగే సెట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమన్నారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాలు అన్నీ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. వికలాంగులు, పరీక్షలు రాయలేని వారు పరీక్ష స్క్రైబ్ కోసం వారం రోజుల ముందే పరీక్షా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు.
‘సెట్’కు సర్వం సిద్ధం
Published Wed, Feb 4 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement