'కార్పొరేట్ రంగాలకు బాబు సర్కార్ దాసోహం'
దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోందని రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అగ్రకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, రావెల కిషోర్బాబు ఎందుకు మాట్లాడటం లేదని..? ఆయన ప్రశ్నించారు. దీనిపై సీఎంకు లేఖ రాస్తే ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు. కార్పొరేట్ రంగాలకు చంద్రబాబు సర్కార్ దాసోహమైందని రామకృష్ణ విమర్శించారు.