కారు బీభత్సం.. ధ్వంసమైన వాహనాలు
12 మంది నర్సింగ్ విద్యార్థినులకు గాయాలు
హైదరాబాద్: మితిమీరిన వేగంతో దూసుకుపోతు న్న ఓ క్యాబ్ డ్రైవర్... అదుపు తప్పి బీభత్సం సృష్టించాడు. 12 మంది నర్సింగ్ విద్యార్థులను ఢీకొట్టి... గాయాలపాలు చేశాడు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. అపోలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు 12 మంది ఫిలింనగర్‌లో అపోలో హెల్త్ ట్రైనింగ్ సెంటర్ వద్ద పల్స్‌పోలియో కార్యక్రమానికి వెళ్లే క్రమంలో వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సమీపం లోని కొత్తచెరువు పక్కన ఉన్న మహాత్మాగాంధీ నగర్ బస్తీ వాసి శ్రీకాంత్ అలియాస్ చిన్న (19)... తన స్నేహితుడు పప్పీతో కలసి క్యాబ్‌లో వేగంగా వెళుతున్నాడు.
కారుకు అడ్డంగా ఓ వ్యక్తి రావడం తో... అతడిని తప్పించబోయి అక్కడున్న విద్యార్థి నులను ఢీకొట్టాడు. ఒక్కసారిగా అక్కడ హాహా కారాలు మిన్నంటాయి. ఘటనా స్థలం రక్తసిక్తమైం ది. విద్యార్థులంతా కేకలు వేశారు. పక్కనే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపైకి కూడా కారు దూసుకెళ్లింది. పలు వాహనాలు ధ్వంసమయ్యా యి. విద్యార్థినుల్లో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన లీనా (23), యోగిత(21)కు గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరి నీ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.