నాగోలు, న్యూస్‌లైన్: ఏటీఎం కేంద్రా ల్లో జమ చేయాల్సిన రూ.30 లక్షల నగదుతో ఓ డ్రైవర్ ఉడాయించాడు. ఎల్‌బీనగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌లో లాగి క్యాష్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వివిధ ఏటీఎంలలో నగదు జమ చేస్తారు. నేరేడ్‌మెట్‌లో ఉండే నల్లగొం డ జిల్లా వాసి ఎల్క సత్యనారాయణ తన క్వాలిస్ (ఏపీ 29 ఈ 2988)ను లాగి ఏజెన్సీకు అద్దెకివ్వడమే కాకుండా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ఇండియన్ బ్యాంకులో రూ.60 లక్షలు డ్రా చేసుకొని ఏటీఎంలలో డబ్బు జ మ చేసే టెక్నీషియన్స్ రామ్‌కుమార్, వినయ్, సెక్యూరిటీ గార్డు ఖాసీం వలి (రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్)తో క్వాలిస్ లో బయల్దేరారు. అత్తాపూర్, అశోక్‌నగర్, చౌటుప్పల్ ఏటీఎంలలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. కడ్తాల్‌లోని ఇండియన్ బ్యాంకులో రూ.20 లక్షలు డ్రా చేసి, అక్కడే ఉన్న ఏటీఎంలో జమ చేశారు. కర్మన్‌ఘాట్ గాయత్రినగర్, ఈసీఐఎల్, సైదాబాద్‌లలోని ఏటీఎంలలో రూ.10 లక్షల చొప్పున జమ చేయాల్సి ఉంది.
అయితే, కర్మన్‌ఘాట్‌కు వచ్చేసరికి రాత్రి అయింది. దీంతో సత్యనారాయణ బైరామల్‌గూ డ మాధవనగర్‌లో ఉండే తన స్నేహితుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి భోజనానికి ఇంటికి వస్తున్నామని తెలిపాడు. మధ్యలో బిర్యానీ తీసుకొన్నారు. ఇం టి ముందు కారును పార్క్ చేసి, రెం డో ఫ్లోర్‌లో ఉన్న శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. బిర్యా నీ తిన్నాక, సిగరెట్ తాగి వస్తానని కిందకు దిగిన సత్యనారాయణ క్వాలి స్‌తో సహా పరారయ్యాడు.
కొంతసేపటి తర్వా త కిందకు దిగిన సిబ్బందికి వాహనం కనిపించక పోవడంతో సత్యనారాయణకు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో బ్యాంకు మేనేజర్‌కు సమాచారమిచ్చిన సిబ్బంది.. వనస్థలిపురం ఠా ణాలో ఫిర్యాదు చేశారు. తమ పరిధిలోకి రాదని వారు చెప్పడంతో శనివా రం రాత్రి ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసిన పోలీ సులు సిబ్బంది రామ్‌కుమార్, వినయ్, ఖాసీంవలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రూ.30 లక్షలతో డ్రైవర్ పరార్
Published Mon, Sep 9 2013 1:57 PM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement