హైదరాబాద్: తమ సంస్థలో శిక్షణ పొందిన వారికి నీట్‌లో గ్యారంటీగా సీటు పొందొవచ్చని ప్రకటనలు ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బి.వెంకట్ నర్సింగ్‌రావు శుక్రవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ ఏడాది ప్రోగ్రామ్ 'ష్యూర్‌నీట్'లో చేరిన వారికి సీటు రాకుంటే 60 శాతం ఫీజు వాపస్ ఇస్తామంటూ శ్రీచైతన్య విద్యాసంస్థ వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన సదరు సంస్థపై చర్యలు తీసుకోవాలని వెంకట్ నర్సింగరావు పోలీసు ఫిర్యాదులో కోరారు.