sri chaitanya educational institutions
-
శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా. BS రావు కన్నుమూత
హైదరాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా.బి.ఎస్. రావు కన్నుమూశారు. BS రావు వయస్సు 75 ఏళ్లు. ఈ ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురయినట్టు శ్రీచైతన్య వర్గాలు తెలిపాయి. దీంతో బి.ఎస్. రావును హుటాహుటిన జూబ్లీహిల్స్ అపొలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించినా.. బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విజయవాడలోని తాడిగడపకు తరలిస్తారు. ఆయన కూతురు సీమ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. ఆమె తిరిగిరాగానే BS రావు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తారు. అలుపెరుగుని విద్యా ప్రస్థానం డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన BS రావు.. లండన్ లో MRSH చదివారు. అక్కడే ఇంగ్లండ్ లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలం ఇరాన్ లో వైద్య సేవలు అందించారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. భార్య భర్తలిద్దరు విదేశాల్లో మెడిసిన్ ప్రాక్టీస్ అనంతరం 1986లో దేశానికి తిరిగి వచ్చారు. (భార్య ఝాన్సీ లక్ష్మీబాయితో బీఎస్ రావు) పోరంకి నుంచి అన్ని రాష్ట్రాల్లోకి 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, వాటిని అగ్రపథంలో నడిపించారు. విజయవాడలోని పోరంకిలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన విద్యా సంస్థల ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛండీఘర్, రాంచీ, బొకారో, ఇండోర్ లలో బ్రాంచ్ లు నెలకొల్పారు. కర్ణాటకలో బెంగళూరు, గంగావతి, రాయచూరులలో ఎన్నో బ్రాంచులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీచైతన్యకు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 CBSE స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 8లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థానానికి చేరడానికి విశేషకృషి చేశారు BS రావు. వారసత్వానికి బాధ్యతలు BS రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు సీమ, మరొకరు సుష్మ. ఇద్దరు కూతుళ్లకు విద్యాసంస్థల బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు BS రావు. శ్రీచైతన్య టెక్నో స్కూళ్లకు అకాడమిక్ డైరెక్టర్ గా సీమ ఉన్నారు. ఇక సుష్మ సంస్థకు CEOగా, అకడమిక్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 45 వేల మంది పని చేస్తున్నారు. సమాజానికి తన వంతుగా విద్యారంగంలో BS రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధిత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఫ్లోరోసిస్ కారణంగా కన్ను మూసిన కుటుంబాల నుంచి వంద మంది చిన్నారులకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుంచి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించారు BS రావు. -
విద్యార్థుల కోసం సరికొత్త యాప్‌ను లాంచ్ చేసిన శ్రీ చైతన్య..!
హైదరాబాద్: విద్యార్థులకు పూర్తి స్థాయి శిక్షణ అందించేందుకు శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొత్తగా ’ఇన్ఫినిటీ లెర్న్’ యాప్‌ను ప్రారంభించింది. 6–12 తరగతుల విద్యార్థులకు అత్యుత్తమ ఫ్యాకల్టీ, కంటెంట్‌తో పాటు వ్యక్తిగతీకరించిన ఇంటరాక్టివ్ క్లాసులను అందించడమే దీని లక్ష్యమని యాప్ ఆవిష్కరణ సందర్భంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఐఐటీ–జేఈఈ, నీట్, సీబీఎస్ఈ బోర్డ్ మొదలైన పరీక్షలకు విద్యార్థులు సులభంగా సిద్ధం కావచ్చని శ్రీచైతన్య–ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్, డైరెక్టర్ సుష్మ బొప్పన పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఫిజికల్ క్లాస్రూమ్ స్థాయి శిక్షణను డిజిటల్ మాధ్యమంలో అందించాలన్నది తమ ఉద్దేశమని ఆమె వివరించారు. తమ విశిష్టమైన ‘4అ లెర్నింగ్ మోడల్’.. విద్యాభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని, విద్యార్థులను విజేతలుగా నిలబెట్టగలదని ఇన్ఫినిటీ లెర్న్ సీఈవో ఉజ్వల్ సింగ్ తెలిపారు. ఇందులో 2–వే ఇంటరాక్టివ్ వీడియో తరగతు లు, క్విజ్లు, మాక్ టెస్ట్‌లు, చిట్కాలు, మొదలైన ఫీచర్లు అనేకం ఉన్నాయని వివరించారు. చదవండి: జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు..కేంద్రం వివరణ..! -
శ్రీ చైతన్య సమర్పించు ఇన్ఫినిటీ లెర్న్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.. ఇన్ఫినిటీ లెర్న్ పేరుతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కొత్త విభాగం కోసం సుమారు రూ.370 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఫౌండర్, చైర్మన్ బి.ఎస్.రావు వెల్లడించారు. అంతర్గత వనరుల నుంచే ఈ నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. ‘35 ఏళ్లుగా విద్యా బోధన అందిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఎడ్ టెక్ విభాగంలోకి ప్రవేశించడం సరైన సమయం. ఈ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదగాలన్నది మా లక్ష్యం. ఇందుకు మా వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయి. ఇన్ఫినిటీ లెర్న్ కంటెంట్ కోసం 100 మంది పరిశ్రమ నిపుణులు, సాంకేతిక సిబ్బందిని నియమించాం. నాణ్యతలో రాజీ పడకుండా కంటెంట్ కోసం ఇతర ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం’ అని వివరించారు. మెరుగైన కంటెంట్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలోకి ఆలస్యంగా వస్తున్నప్పటికీ విద్యార్థులకు అవసరమయ్యే మెరుగైన కంటెంట్‌తో రంగ ప్రవేశం చేస్తున్నామని శ్రీ చైతన్య కో–ఫౌండర్ సుష్మ బొప్పన తెలిపారు. ఇండియాలో ఎడ్యుకేషన్ టెక్నాలజీకి అపారమైన అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బైజూస్, అన్ అకాడమీలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థ కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది. చదవండి : అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల -
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ఇంటర్ బోర్డు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తీరు చూస్తుంటే గుర్తింపు లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్న సంస్థల పక్షాన ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ కాలేజీలతో చేతులు కలిపినట్లు, కుమ్మక్కైనట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చే సింది. గుర్తింపు లేని కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై ఏ చ ర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇంటర్ బోర్డుతోపాటు ప్ర భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనుమతుల్లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నాయని, సెలవుల్లోనూ కాలేజీలను నడుపుతున్నాయని, వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన రాజేష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీసం 20 వేల మంది విద్యార్థులు గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్నారని, వాళ్ల జీవితాలతో ఆడుకునే అవకాశం ఇంటర్ బోర్డు క ల్పించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే విద్యా సంవత్స రం ప్రారంభంలోనే కాలేజీలకు గుర్తింపు దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. హత్య చేసిన వ్యక్తి ఇక ముందు హత్యలు చేయబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే హంతకుడ్ని వదిలేస్తామన్నట్లుగా ఉందంది. జరిమానాలు వసూలు చేశాం..: హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇంటర్ బోర్డు కార్యదర్శి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ‘అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీలు లేకుండా ఉన్న భవనాల్లో నారాయణ 28, శ్రీచైతన్య 18 చొప్పున కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే వాటిలో కాలేజీ లు నిర్వహిస్తున్నాయి. ఇందులో నారాయణ 4, శ్రీచైతన్య 2 కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కా లేజీకి రూ.లక్ష చొప్పున పెనాల్టీ వసూలు చే శాం. ఆ తర్వాతే వాటిని వేరే చోటకు తరలించేందుకు అనుమతి ఇ చ్చాం. సెలవుల్లో కూడా ఆ కాలేజీలు తరగతులు నిర్వహించడంతో రోజుకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించాం. రూ.17 లక్ష లు నారాయణ, రూ.10 లక్షలు శ్రీచైతన్యలకు జరిమానాగా వసూలు చేశాం. నారాయణ, శ్రీచైతన్యలకు 52 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్‌పై హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. హైకోర్టు ఆదేశాలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల్లో తనిఖీలు చేశాం’ అని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. జరిమానాలు విధించి వదిలేస్తారా? ప్రభుత్వం తరఫున ప్రత్యే క న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదిస్తూ, అఫిలియేషన్ లే కుండా కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసు కుంటామని చెప్పారు. నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 46, 49 చొప్పున కా లేజీలకు అనుమతిచ్చామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. మార్చిలో వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చట్ట ప్రకారం అనుమతులు పొందాలని ఆయా కాలేజీలకు నో టీసులిచ్చినట్లు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారో ఇంటర్ బోర్డు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 27కి వాయిదా వేసింది. -
శ్రీచైతన్య విద్యాసంస్థల వద్ద ప్రైవేట్ టీచర్స్ నిరసన
-
శ్రీచైతన్యవి నిరాధార ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శ్రీచైతన్య విద్యాసంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తున్నట్టు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నారాయణ మేథోసంపత్తి నుంచే చైనా ప్రోగ్రామ్ ఉద్భవించిందన్న సంగతి అందరికీ తెలుసునని పేర్కొంది. ‘‘2005, 2006, 2007 ప్రారంభంలో నారాయణ విద్యాసంస్థలు ఇదే ప్రోగ్రాంను నారాయణ సి.ఒ. స్పార్క్ పేరుతో ప్రారంభించింది నిజం కాదా? 2007లో ఇదే ప్రోగ్రాం నుంచి ఏఐఈఈఈ (నేటి జేఈఈ మెయిన్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, 2008 లో 2, 4, 10.. 2009లో 3, 4, 6, 7.. వంటి ర్యాంకులను సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఐఐటీలో 2008లో టాప్ 10లో 3, 4, 7, 8 ర్యాంకులు ఆ తర్వాత సంవత్సరాల్లో నూ అనేక ఉత్తమ ర్యాంకులన్నీ చైనా ప్రోగ్రామ్ తో సంబంధం లేకుండా నారాయణ విద్యాసంస్థలే సాధించాయి’’అని ప్రకటనలో పేర్కొన్నా రు. శ్రీశార్వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించేటప్పుడు, తెలుగు విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావాలన్న నెపంతో తమను ఒప్పించి చైనా ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించింది. చైనా ప్రోగ్రామ్ కంటే ముందు ఐఐటీ ప్రో గ్రామ్ ద్వారా సాధించిన అత్యుత్తమ ర్యాం కులు ఏంటో శ్రీచైతన్య చెప్పగలదా అని ప్రశ్నించింది. 2012 వరకు నారాయణ విద్యార్థుల టాప్–10 ఐఐటీ ర్యాంకులెన్ని, శ్రీచైతన్య ర్యాంకులెన్ని అన్న విషయాన్ని ప్రజలకు చెప్ప గలరా అని పేర్కొంది. 2012 తర్వాత తాము రూపొందించిన ఐఐటీ ప్రోగ్రామ్‌ను కాపీ కొట్టి శ్రీచైతన్య లబ్ధి పొందిందని ఆరోపించింది. ‘టాప్ ర్యాంకుల సాధన కోసం శ్రీచైతన్యకు ప్రణాళిక లేదన్నది నిజం. మేం రూపొందించి న విద్యాప్రణాళిక సాయంతో సాధించుకుంటు న్న ర్యాంకులను మా విద్యార్థులు, మా ప్రో గ్రా మ్ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం?’’అని ప్రశ్నించారు. శ్రీశార్వాణి సొసైటీ ఒప్పందం ప్రకారం అందులో సమాన భాగస్తులం కాబట్టి, అది పూర్తయ్యే వరకు ఇరు యాజమాన్యాలకు టాప్ ర్యాంకులను ప్రకటించుకునేహక్కు ఉంటుందని స్పష్టం చేసింది. -
నారాయణ విద్యా సంస్థలపై చర్యలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్, జేఈఈ మెయిన్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి విద్యా సంస్థల్లో చదివిన వారిగా, వారికి ర్యాంకులు తెప్పించిన క్రెడిట్ తమదేనన్న అర్థం వచ్చేలా నారాయణ విద్యాసంస్థ అడ్వర్టయిజ్మెంట్లు ఇస్తోందని శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బీఎస్‌రావు, డైరెక్టర్ సుష్మ పేర్కొన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను నారాయణ విద్యా సం స్థల విద్యార్థులుగా చెప్పుకోవడం తప్పని అన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు చేపట్టే వీలుందని, భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే చర్యలు తప్పవన్నారు. శుక్రవారం వీరు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యారంగంలో విశేష కృషి చేయాలన్న ఉద్దేశంతో ఐదేళ్ల కిందట శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు సంయుక్తంగా శార్వాణి విద్యాసంస్థలను (చైనా బ్యాచ్) ఏర్పా టు చేశాయని, అయితే అన్ని అంశాల్లో నారా యణ విద్యా సంస్థల నుంచి సహకారం అందడం లేదని చెప్పారు. గతేడాది నుంచే సమావేశాలు జరగలేదని, దీంతో కీలక నిర్ణయాలు ఆగిపోయాయన్నారు. గత అక్టోబర్‌లో కేసులు పెట్టడం వంటి చర్యలతో దూరమయ్యామని, గత నెల 12న జరిగిన చివరి సమావేశంలో తెగదెంపులు చేసుకున్నామన్నారు. శార్వాణికి పంపించిన ఎవరి విద్యార్థుల బాధ్యత వారిదేనని, ఎవరి విద్యార్థుల ర్యాంకులను వారే ప్రకటించుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రస్తు తం అదే కొనసాగు తోందన్నారు. అయితే, మొన్నటి జేఈఈ ర్యాం కుల్లో శ్రీచైతన్య విద్యార్థులను నారాయణ విద్యార్థులుగా చూపించుకున్నారని చెప్పారు. తాము శార్వాణికి పంపించినవారే కాకుండా తమ విద్యాసంస్థలో ఇంటర్ చదివిన వారి సక్సెస్ కూడా నారాయణ సంస్థలదే అన్నట్లుగా ప్రకటనలు ఇచ్చి తప్పు చేశారన్నారు. ఏపీ ఇంటర్ పరీక్షఫలితాల్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండు సంస్థలకు చెందిన వారుగా ఇచ్చారని, ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల తో సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను చేర్పించాలన్నారు. చైనా పేరుతో ఇకపై ఉండబోదని, ఇక సెకండియర్ బ్యాచ్ ఒకటే ఉందని, అదే చివరిదని స్పష్టంచేశారు. -
‘ఏసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్’ విజేత శ్రీ చైతన్య
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో సేవలకు గాను ఏషియావన్ మేగజైన్ ప్రకటించిన ‘ఏసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్–2017’ అవార్డు శ్రీ చైతన్య విద్యాసంస్థలకు దక్కింది. విజేతను ప్రఖ్యాత సంస్థ ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ ఎంపిక చేసింది. సింగ పూర్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బీఎస్ రావు తరఫున అకడమిక్ డైరెక్టర్ సుష్మ అవార్డును స్వీకరించారు. ఇది తమ సంస్థ అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవమని బీఎస్ రావు పేర్కొన్నారు. -
‘నారాయణ’పై ఆరోపణలు అవాస్తవం
హైదరాబాద్: నారాయణ సంస్థలపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నారాయణ కేంద్ర కార్యాలయ ఉద్యోగి సునీత కొట్టిపారేశారు. నారాయణలో మహిళలకు రక్షణ లేదంటూ మాజీ ఉద్యోగిని శిరీష చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ నారాయణ సంస్థలో 26 వేల మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. మహిళల ప్రోత్సాహానికి నారాయణ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో పనిచేస్తున్న శిరీష ఆ సంస్థ ప్రలోభాలకు లోనై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా నారాయణలో ఉద్యోగులుగా కొనసాగుతున్న వారు అనేక మంది ఉన్నారని గుర్తు చేశారు. శిరీష చేసిన ఆరోపణల వెనుక శ్రీ చైతన్య హస్తం ఉందని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం మ హిళలను కించపరిచేలా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అసలు శ్రీలత మరణం వెనుక నారాయణ ఉద్యోగుల హస్తం ఉందనటం భావ్యం కాదన్నారు. మహిళా ఉద్యోగి ప్రమీల రాణీ మాట్లాడుతూ ఆడియో టేపులను సమర్థిస్తూ శిరీష చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ఆడియో టేపుల వెనుకున్న నిజాలను విచారిస్తున్నామని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
'ష్యూర్ నీట్'పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తమ సంస్థలో శిక్షణ పొందిన వారికి నీట్లో గ్యారంటీగా సీటు పొందొవచ్చని ప్రకటనలు ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బి.వెంకట్ నర్సింగ్‌రావు శుక్రవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఏడాది ప్రోగ్రామ్ 'ష్యూర్‌నీట్'లో చేరిన వారికి సీటు రాకుంటే 60 శాతం ఫీజు వాపస్ ఇస్తామంటూ శ్రీచైతన్య విద్యాసంస్థ వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన సదరు సంస్థపై చర్యలు తీసుకోవాలని వెంకట్ నర్సింగరావు పోలీసు ఫిర్యాదులో కోరారు.