జర భద్రం..! | Central Intelligence Agency announced the alert | Sakshi
Sakshi News home page

జర భద్రం..!

Published Sat, Jun 10 2017 3:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

జర భద్రం..!

జర భద్రం..!

- ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో నగరంలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మాల్స్‌ 
- అప్రమత్తత ప్రకటించిన కేంద్ర నిఘా సంస్థ 
ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు 
 
సాక్షి, హైదరాబాద్‌: ముష్కరమూకలు బెంగ ళూరుతో పాటు హైదరాబాద్‌ నగరాన్నీ టార్గె ట్‌ చేశారా? ఔననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నెలాఖరు వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించాయి. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో పాటు ప్రముఖ మాల్స్‌ ఉన్నట్లు వెల్లడైంది. ఈ హెచ్చరికల్ని పరిగణన లోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. 
 
రషీద్‌ విచారణలో వెలుగులోకి... 
గత నెల 7న జమ్మూకశ్మీర్‌ టాంట ప్రాంతం లోని పోలీసు పికెట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)... గత నెల 13న కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. పాక్‌ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల మేరకు పనిచేసిన ఈ మాడ్యూల్‌కు అబ్దుల్‌ రషీద్‌ హర్గా నేతృత్వం వహించాడు. రషీద్‌ విచారణలో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. లష్కరే తోయిబా బెంగళూరు, హైదరాబాద్‌లను టార్గెట్‌ చేసిందని, ఐటీ సంస్థలతో పాటు మాల్స్‌లోనూ విధ్వంసం సృష్టించడా నికి పథక రచన చేసినట్లు అతడు తెలిపాడు. ఈ క్రమంలో కేంద్ర నిఘా సంస్థ ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నెలాఖరు వరకు... ప్రధానంగా వారాంతాల్లో నిఘా, తనిఖీలు, సోదాలు ముమ్మరం చేయాలని సూచించింది. 
 
ఇనార్బిట్‌ మాల్‌లో తనిఖీలు... 
మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో పోలీసు లు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. సైబరాబాద్‌ సెక్యూరిటీ వింగ్, మాదాపూర్‌ పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్‌ ఈ సోదాలు చేశారు. మాల్‌ సెక్యూ రిటీ సిబ్బంది మెటల్‌ డిటెక్టివ్‌తో తనిఖీలు చేశారు. ఐడీ కార్డులు లేనివారిని లోపలికి అనుమతించలేదు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement