హైదరాబాద్: గొలుసు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్‌లో రెండుచోట్ల తమ ప్రతాపం చూపించారు. ఇద్దరు మహిళల మెడలలో నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కొని వెళ్లారు.
గోపాలపురంలో రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. రెప్పపాటులో మెడలోని బంగారు అభరణాలు లాక్కెళ్లడంతో ఆ మహిళ షాక్ తిన్నది. కాగా, తుకారంగేట్ ప్రాంతంలోనూ చైన్ స్నాచర్లు ఇదేవిధంగా ఓ మహిళ మెడలోనుంచి తాళిబొట్టు సహ బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తాళిబొట్టు సహ అభరణాలను కొట్టేశారు!
Published Wed, Jun 15 2016 11:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement