
సీఎం కిక్కురుమనలేదు
హైదరాబాద్: ప్రధాని మోదీ పర్యటనపై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి... యమునా నదిలో ముంచేశారని అన్నారు.
దీనిపై చంద్రబాబు కిక్కురమనకుండా ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న, పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా మోదీ ప్రత్యేక హోదా అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.