‘చలో హైకోర్టు’కు అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి | Chalo High Court is not allowed: CP Mahender Reddy | Sakshi

‘చలో హైకోర్టు’కు అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి

Jun 13 2016 2:29 AM | Updated on Sep 4 2018 5:21 PM

‘చలో హైకోర్టు’కు అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి - Sakshi

‘చలో హైకోర్టు’కు అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి

ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ సోమవారం నిర్వహించనున్న ‘చలో హైకోర్టు’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ సోమవారం నిర్వహించనున్న ‘చలో హైకోర్టు’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంపై నిషేధం ఉందన్నారు.

నిషేధాజ్ఞలు అతిక్రమించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాల ప్రకారం ప్రాక్టిసింగ్ అడ్వకేట్‌లకు అనుమతిస్తామని తెలిపారు. చలో హైకోర్టు కార్యక్రమ నేపథ్యంలో అదనపు బందోబస్తు, ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement