హైదరాబాద్: నగరంలో ఐసీస్ ఉగ్రవాదుల ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. భద్రత విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.
రంజాన్ మాసం చివరి శుక్రవారం నేపథ్యంలో పాతబస్తీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రెండు వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్టాడుతూ.. సిటీ అంతటా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు.. స్పెషల్ పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. సిటీ అంతా ప్రశాంతంగా ఉందని ఆయన తెలిపారు.
'సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దు'
Published Fri, Jul 1 2016 1:33 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement