షీ టీమ్స్కు 2,220 ఫిర్యాదులు : సీపీ | hyderabad CP mahender Reddy explains she team file cases | Sakshi
Sakshi News home page

షీ టీమ్స్కు 2,220 ఫిర్యాదులు : సీపీ

Published Thu, Sep 1 2016 1:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

షీ టీమ్స్కు 2,220 ఫిర్యాదులు : సీపీ - Sakshi

షీ టీమ్స్కు 2,220 ఫిర్యాదులు : సీపీ

షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 2,220 ఫిర్యాదులు తమకు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మహేందర్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షీమ్స్ కు సోషల్ మీడియా ద్వారా, నేరుగా, ఇతరత్రా మీడియా ద్వారా ఎన్ని ఫిర్యాదులు అందాయో ఆయా కేసుల నమోదు గురించి చెప్పారు.

ప్రత్యక్షంగా 378, ఈమెయిల్స్ ద్వారా 165, ఫేస్ బుక్ ద్వారా 320, వాట్సాప్ ద్వారా 162, డయల్ 110 ద్వారా అధికంగా 1157 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 712 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని సీపీ పేర్కొన్నారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, మరో 65 మందిపై నిర్భయ కేసులు పెట్టినట్లు మహేందర్ రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement