ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాలను నిలిపివేయడం సీఎం చంద్రబాబు నియంత పోకడలకు నిదర్శనమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాలను నిలిపివేయడం సీఎం చంద్రబాబు నియంత పోకడలకు నిదర్శనమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ధ్వజమెత్తారు. మీడియాను అణగదొక్కాలనుకోవడం అప్రజాస్వామికమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం భావప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనన్నారు. ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేతను రాజకీయంగా ఎదగకుండా చేయాలనే సాక్షి ప్రసారాలను నిలిపివేశారన్నారు. ఈ ప్రసారాలను పునరుద్ధరించకపోతే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో మాలమహానాడు ఆందోళనలకు సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.