104 స్థానంలో ఉన్నట్టుండి తన పేరును చేర్చాలని సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రతి సేవకూ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 104 వాహనాలకు తన పేరే పెట్టాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ‘చంద్రన్న సంచార చికిత్స’ పేరుతో 104 వాహనాలను పల్లెలకు పంపించనున్నారు. మొన్నటివరకూ కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచిన ఈ పథకం 104 (సంచార వైద్యశాల) పేరు మార్చి పిరమిల్‌స్వాస్థ్య అనే ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభిస్తారని ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనికి ముందుగా సంచార చికిత్స అనే పేరును ఖరారు చేశారు. ఉన్నట్టుండి సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో చంద్రన్న పేరును చేర్చాలని నిర్ణయించారు. దీనికి భారీగా ప్రచారం చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఈ వాహనాలకు లేబులింగ్, స్టిక్కరింగ్‌ల పేరుతో భారీగా ఖర్చు చేశారు.
ఏఎన్‌ఎంలే దిక్కు: వాస్తవానికి టెండరులో ఒక్కో వాహనానికి ఒక్కో స్టాఫ్ నర్సును నియమించాలి. కానీ జిల్లాకు ఒకరిద్దరు మాత్రమే స్టాఫ్‌నర్సులను నియమించి, మిగతా వాహనాలన్నిటికీ ఏఎన్‌ఎంలనే నియమించారు. గతంలో 104 వాహనాలకు ప్రత్యేక బడ్జెట్‌తో మందులు తెచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల మందులనే ఇస్తున్నట్టు తేలింది. మళ్లీ పల్లెరోగులకు అరకొర మందులే దిక్కు కానున్నాయి.
నేటి నుంచి చంద్రన్న సంచార చికిత్స
Published Wed, Apr 20 2016 2:00 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement