సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి దిగుమతి అయిన పళ్లను తింటున్నాం కానీ, స్థానికంగా పండే మామిడి పండ్లను మాత్రం దూరం పెడుతున్నామని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారు చెంగల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ‘పండ్ల సాగు రైతుల సమస్యలు– పరిష్కారాల’పై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కాలిఫోర్నియా నుంచి యాపిల్, న్యూజిలాండ్ నుంచి కివీ పండ్లను దిగుమతి చేసుకొని తింటున్న మనం వివిధ కారణాలతో మామిడి పండ్లను దూరం పెట్టే పరిస్థితి దాపురించింది. ఆయా దేశాలకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పండ్లను ఎగుమతి చేస్తుంటే, అటువంటి పరిజ్ఞానం మామిడికి ఉపయోగించలేక పోతున్నాం. దీంతో రైతులు నష్టపోతున్నారు’ అని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment