గ్రేటర్లో చిరంజీవి ప్రచారం: ఉత్తమ్ | Chiranjeevi campaign in GHMC Elections, says uttamkumar reddy | Sakshi
Sakshi News home page

గ్రేటర్లో చిరంజీవి ప్రచారం: ఉత్తమ్

Published Wed, Jan 13 2016 8:18 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

గ్రేటర్లో చిరంజీవి ప్రచారం: ఉత్తమ్ - Sakshi

గ్రేటర్లో చిరంజీవి ప్రచారం: ఉత్తమ్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఏడాదిన్నర పాలనలో హైదరాబాద్ నగరం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ... గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కార్పొరేటరే మేయర్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు. గెలుపుపై ధీమా ఉంటే మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఇవ్వరాదని ప్రభుత్వానికి సూచించారు. 150 మంది కార్పోరేటర్లతోనే మేయర్ ఎన్నిక జరగాలని ప్రభుత్వాన్ని ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేస్తారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగుకావడం ఖాయమని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement