సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్టించే మట్టి వినాయక ప్రతిమలను 50% సబ్సిడీ ధరపై అందించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పా ట్లు చేసింది. నగరంలోని 25 ప్రాంతా ల్లో ఈ నెల 6 నుంచి 8 వరకు విక్రయానికి పెడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. 8 అంగుళాల మట్టి గణపతి ధర రూ.12.50. అలాగే 3 అడుగుల విగ్రహానికి రూ.1500 ధర నిర్ణయించినట్లు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్‌డీ పి.రాజేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలో ఎ క్కువగా డిమాండ్ ఉండే 8 అంగుళాల చిన్న సైజ్ మట్టి విగ్రహాలు 30వేలు, 3 అడుగుల విగ్రహాలను 300 విక్రయానికి సిద్ధం చేశామన్నారు.
3 అడుగుల విగ్రహాలు కావాల్సిన వారు ముందస్తుగా హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ ( www.hmda.gov.in)లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నగరంలోని 25 ప్రాంతాల్లో చిన్న విగ్రహాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే 3 అడుగుల విగ్రహాలను లుంబినీ పార్కులోని లేజర్ షో కాంప్లెక్స్ వద్ద మాత్రమే విక్రయిస్తామని తెలిపారు. ‘మీ వినాయకుడిని సహజసిద్ధ రంగులతో అలంకరించండి’ అన్న నినాదంతో ఈ నెల 8న నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద హోంసైన్స్ కాలేజీ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓఎస్‌డి తెలిపారు. ఈ సందర్భంగా ఆ కళాశాల వారు సహజ రంగులను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు.
మట్టి గణపతులకు జై...
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులు, ఇతర జలాశయాలు కలుషితం కాకుండా చూసేందుకు మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హెచ్‌ఎండీఏ కృషి చేస్తోందని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా రూ.7.5 లక్షల నిధులు కేటాయించి మట్టి వినాయక విగ్రహాల తయారీ బాధ్యతను ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. పెద్ద విగ్రహాల వల్ల చెరువుల్లో పూడిక పేరుకుపోతుందన్న ఉద్దేశంతో వాటి ఎత్తును ఈ ఏడాది 3 అడుగులకే పరిమితం చేశామన్నారు.
కొసమెరుపు: మూడేళ్లుగా మండపాల్లో ప్రతిష్టించే మట్టి విగ్రహాలను ఉచితంగా సరఫరా చేసిన హెచ్‌ఎండీఏ ఈ ఏడాది రూ.1500 (3 అడుగులు) ధర నిర్ణయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
మట్టి వినాయకులు రెడీ
Published Wed, Sep 4 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement