అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల వ్యవహారాలను జూన్ 30 లోగా సేకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు.
హైదరాబాద్: అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల వ్యవహారాలను జూన్ 30 లోగా సేకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. సోమవారం ఆయన కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. భూవివాదాలు పరిష్కరించి భూమి రికార్డులను సరిచేయాలని చెప్పారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంత మయ్యాయని, వాటిని మళ్లీ స్వంతదారులకు అప్పగించండమో.. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమో జరగాలన్నారు.
తెల్లకాగితాలపై భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. జూన్ 2 నుంచి 10 వరకు తెల్లకాగితాలపై జరిగిన భూలావాదేవీలను రిజిస్ట్రర్ చేయలని చెప్పారు.రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 5 ఎకరాల లోపు తెల్లకాగితాలపై ఉన్న ఒప్పందాలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా సూచించారు.