కాంగ్రెస్ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అందుకోసమే వారందరూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. గ్రేటర్లో మౌలిక సదుపాయాలు లేకపోవడానికి ఆ పార్టీలే కారణమని హరీష్ రావు విమర్శించారు.