వీణావాణీలకు శస్త్రచికిత్స చేస్తాం... | Conjoined Twins Veena and Vani to Undergo Separation Surgery in astraia | Sakshi
Sakshi News home page

వీణావాణీలకు శస్త్రచికిత్స చేస్తాం...

Published Fri, Sep 2 2016 7:57 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

వీణావాణీలకు శస్త్రచికిత్స చేస్తాం... - Sakshi

వీణావాణీలకు శస్త్రచికిత్స చేస్తాం...

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణావాణీకి శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా డాక్టర్ల బృందం సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ చేరుకున్న ఆస్ట్రేలియా డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే తాము వీణావాణీకి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.

కాగా  వీణావాణిలను వేరు చేసే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement