veena-vaani
-
వీణావాణీలకు శస్త్రచికిత్స చేస్తాం...
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణావాణీకి శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా డాక్టర్ల బృందం సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే తాము వీణావాణీకి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. కాగా వీణావాణిలను వేరు చేసే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. -
'వీణా-వాణీల ఆపరేషన్‌పై ఫోకస్ చేయలేదు'
-
'వీణా-వాణీల ఆపరేషన్‌పై ఫోకస్ చేయలేదు'
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లారు. అవిభక్త కవలలు వీణా-వాణీల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీణా-వాణీల ఆపరేషన్‌పై అంతగా ఫోకస్ చేయడం లేదన్నారు. వారికి సామాజిక భద్రత అవసరమని, వీణా-వాణీల భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పారు.