అంబర్‌పేట (హైదరాబాద్): విమాన ప్రయాణికుడు పోగొట్టుకున్న విలువైన వస్తువును అప్పగించి నిజయితీని చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నరేష్ నాలుగు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అక్కడ లగేజీ స్టాండ్‌లో ఓ బ్యాగ్ కనిపించింది. అందులో రూ.30 వేలు ఖరీదు చేసే కెమెరాతో పాటు కొన్ని పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాలను పరిశీలించగా విశాఖపట్నానికి చెందిన వేమరాజారావుదని తెలిసింది. దీంతో వేమరాజ్‌కు సమాచారం అందించి ఆదివారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి వస్తువులు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కాగా, పోయిన కెమెరాను తిరిగిపొందడంతో వేమరాజారావు సంతోషం వ్యక్తం చేశారు.