సీసీ కెమెరాలతో నేరాలకు చెక్! | crimes rates decrease with cc cameras | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్!

Published Wed, Jun 15 2016 3:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

crimes rates decrease with cc cameras

హైదరాబాద్: నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల కారణంగా నేరాలు తగ్గుముఖం పట్టాయని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్ రెడ్డి అన్నారు. రహమత్‌నగర్ డివిజన్ కార్మిక నగర్‌లోని ఎల్‌ఆర్ కిషోర్ హైస్కూల్ యాజమాన్యం సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తం రూ. 2 లక్షలు అందజేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రహమత్ నగర్ డివిజన్‌లో 200 సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంకయ్య, డైరెక్టర్ హిమబిందు, సెక్టార్ ఎస్ఐలు జగదీష్, సత్తయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement