పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమం
జూలై 4న ‘టీ మాస్ ఫోరమ్’ ఆవిర్భావ సభ: గద్దర్
సాక్షి, హైదరాబాద్: సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. సినీనటుడు రజనీకాంత్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలసి పనిచేయాలని భావిస్తున్నామన్నారు.
తమ ప్రతినిధులు వెళ్లి వారికి తమ విధానాలను వివరించారని, రజనీ కాంత్, పవన్ అంగీకారంకోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. 200 పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. జూలై 4వ తేదీన హైదరాబాద్‌లో టీమాస్ ఫోరమ్ పేరుతో ఏర్పడనున్న ఐక్యవేదిక పోస్టర్‌ను గురువారం ఆయన ఎస్వీకేలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి ఆవిష్కరించారు.