హైదరాబాద్ : నగరంలోని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.