వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్ | digvijay singh support to sc reservation categorization | Sakshi
Sakshi News home page

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్

Published Sun, Aug 7 2016 1:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్ - Sakshi

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకర ణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందేలా చూస్తామన్నారు. వర్గీకరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మూడు సార్లు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. వర్గీకరణ జరిగితే దళితులలో ఐక్యత లోపిస్తుందని కొందరు స్వార్థపరులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement