కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి సమయంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు.
కూకట్‌పల్లి(హైదరాబాద్‌సిటీ): కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి సమయంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలను నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. 11 బైక్‌లు, ఒక కారు, మరో ఆటో, ఒక మినీ బస్సు మొత్తం 14 వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. డంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.