హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం శనివారం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల మొదట్లో ఇఫ్లూలో విద్యార్థినిపై ఆమె స్నేహితులు ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆమె స్నేహితులు నితిన్, రాజసింహలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీకి చెందిన బాధితురాలు ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ రెండవ సంవత్సరం చదువుతుంది.