విద్యుత్తు చార్జీల్లో రాయితీ | Electricity charges in Subsidy | Sakshi
Sakshi News home page

విద్యుత్తు చార్జీల్లో రాయితీ

Published Tue, Jun 28 2016 2:11 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

విద్యుత్తు చార్జీల్లో రాయితీ - Sakshi

విద్యుత్తు చార్జీల్లో రాయితీ

పరిశ్రమలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు విద్యుత్ చార్జీల్లో కొంతమేరకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వస్త్ర, ఉక్కు పరిశ్రమల యాజమాన్యాలకు, పని చేస్తున్న కార్మికులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం చెల్లించే యూనిట్ విద్యుత్ చార్జీలను రూ.2, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధరను రూ.1.50 తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అదనపు కార్యదర్శి శాంతికుమారితో సీఎం ఈ మేరకు చర్చలు జరిపారు. రాష్ట్రంలోని వివిధ స్పిన్నింగ్ మిల్లులలో దాదాపు 40 వేల మంది, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల్లో దాదాపు 5వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

సవరించిన చార్జీలు ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంవత్సరం తరువాత చార్జీలను పునః సమీక్షిస్తారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌కు రూ.6.40 ఉన్న చార్జీ రూ.4.40కు తగ్గుతుంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.5.30 ఉన్న టారిఫ్ రూ.3.80కి చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement