ఆగస్టు 5 నుంచి ఆమరణ దీక్ష: పొన్నం
మెడికల్ కాలేజీపై సీఎం మాట తప్పారు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
గాంధీ భవన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మెడికల్ కాలేజీ కోసం భూమిని కేటాయించిందని వివరించారు. ఆగస్టు 5 నాటికి సీఎం కేసీఆర్ హామీకి మూడేళ్లు దాటుతుందని, అందుకే ఆ రోజు ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు పొన్నం ప్రకటించారు.