హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఇంజనీరింగ్ కాలేజి బస్సు బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలవ్వడంతో ఆ బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు ఆటోలు, మూడు కార్లు, 6 బైకులు ధ్వంసమయ్యాయి. ఒక వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇందులో ఒక ఆటోడ్రైవర్కు కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, ఇబ్రహీంపట్నం మంగళగిరి భారత్ ఇంజనీరింగ్ కాలేజి బస్సుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంజనీరింగ్ కాలేజి బస్సు బీభత్సం..
Published Wed, Dec 23 2015 7:41 PM | Last Updated on Sat, Mar 9 2019 4:29 PM
Advertisement
Advertisement