![డేంజర్ బెల్! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41430674961_625x300.jpg.webp?itok=ZFdo1I-s)
డేంజర్ బెల్!
పొంచి ఉన్న మంచి నీటి ముప్పు
మంజీరలో పడిపోయిన నీటిమట్టం
జంటనగర వాసులకూ ఇబ్బందులే
న్యాల్‌కల్: జంట నగరాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మంజీర నది ప్రస్తుతం వెలవెలబోతోంది. రోజురోజుకూ నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. ఫలితంగా నగరానికి నీటిసరఫరా ఆగిపోయే ప్రమాదం పొంచివుంది. మండు వేసవిలోనూ నీటితో కళకళలాడే మంజీర నది గత సీజన్‌లో భారీ వర్షాలు కురవకపోడంతో దాదాపు ఎండిపోయింది. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం మీదుగా మంజీర హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
గత సీజన్‌లో పెద్దగా వర్షాలు పడకపోవడం, ఎగువ ప్రాంతమైన కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురవక పోవడంతో నదిలోకి నీరు చేరలేదు. ఫలితంగా నది పరీవాహక ప్రాంతాల పంటలు సాగు చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సిటీకి తాగునీటి ఎద్దడి ప్రమాదం ఏర్పడుతోంది.