రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు | Fire on Real estate magnate | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు

Published Thu, Nov 17 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు

పేట్ బషీరాబాద్ ప్రాంతంలో ఘటన
 
 హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పేట్‌బషీరాబాద్ బాపూనగర్‌కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్‌పేరుు నగర్‌కు చెందిన తేజ గత 3 నెలల నుంచి ఓ స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో వాగ్యుద్ధానికి దిగసాగాడు. ఈ క్రమంలోనే తేజ బుధవారం రాత్రి 10.45 గంటలకు బాపూనగర్‌లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, రివాల్వర్‌ను ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్‌రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. రెండో బుల్లెట్ మిస్‌ఫైర్ అరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement