తొలిరోజే 27,500 ఉద్యోగాలు | First day of 27,500 jobs | Sakshi
Sakshi News home page

తొలిరోజే 27,500 ఉద్యోగాలు

Published Tue, Apr 5 2016 3:59 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

తొలిరోజే 27,500 ఉద్యోగాలు - Sakshi

తొలిరోజే 27,500 ఉద్యోగాలు

♦ 28 ఐటీ సంస్థలతో సర్కారు ఒప్పందాలు
♦ ప్రఖ్యాత ప్రైవేటు సంస్థల నుంచి అనూహ్య స్పందన
♦ 2,700 కోట్ల పెట్టుబడులకు అవకాశం
♦ టాస్క్, టీ-హబ్‌లతో పనిచేసేందుకు పలు సంస్థల అంగీకారం
 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విధానానికి ప్రకటించిన తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. పాలసీని ప్రకటించిన వేదికపైనే 25 ప్రఖ్యాత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో, టీ-హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)లతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల మేరకు సుమారు రూ. 2,700కోట్ల పెట్టుబడులతోపాటు దాదాపు 27,500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి.

 రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు ఇలా...
 రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగ పూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ ఐటీ ఆపరేషన్స్ నిమిత్తం 1,500 మందికి ఇందులో ఉద్యోగాలు కల్పిస్తారు. హైదరాబాద్‌లో రూ.1,362కోట్లతో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 వేలమంది నిపుణులు పనిచేసేలా కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చే సేందుకు వాల్యూల్యాబ్స్ ఎంవోయూ చేసుకుంది. ఆర్థిక సేవలతో ఐటీ రంగానికి దన్నుగా నిలుస్తున్న కార్వీ సంస్థ 5 వేలమంది ఉద్యోగులు పనిచేసేలా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. డేటా అనాలసిస్‌లో పేరుగాంచిన ఫ్రాక్టల్ ఎనలిటిక్స్ సంస్థ తెలంగాణలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.

ఎల్‌ఈడీ ఉత్పత్తుల సంస్థ మ్యాక్స్‌టచ్ ప్రతినెలా 30 వేల ఎల్‌ఈడీ టీవీలు, లక్ష మొబైల్ ఫోన్లు, మూడు లక్షల ఎల్‌ఈడీ బల్బులను ఉత్పత్తి చేసే పరిశ్రమను నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. మరో ఎల్‌ఈడీ ఉత్పత్తుల సంస్థ ఎస్‌పీవీ కూడా 5 వేలమందికి ఉపాధి కల్పించేలా రూ.500కోట్లతో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వచ్చే మూడేళ్లలో రూ.200కోట్లతో 100 మిలియన్ ఎల్‌ఈడీ బల్బుల ఉత్పత్తి లక్ష్యంగా క్వాలిటీ ఫోటోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మూడు వేల మందికి ఉపాధి లక్ష్యంగా మొబైల్‌ఫోన్ చార్జర్లు ఉత్పత్తి చేసేందుకు యాక్సిమ్ ముందుకొచ్చాయి. మహిళలకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలను కల్పించే ప్రాజెక్ట్ అమలు నిమిత్తం యూఎన్‌డీపీ, గ్లాస్‌ఫ్రీ ట్యాబ్లెట్స్, మొబైల్‌ఫోన్స్, టీవీలను ఆవిష్కరించే లక్ష్యంగా ఏరీస్ (దుబాయ్) సంస్థ, ఇండియన్ వీడియోగేమ్ ఇండస్ట్రీకి చేయూత అందించేందుకు నాస్కామ్, రూ.40కోట్ల పెట్టుబడితో 600మందికి ఉద్యోగాలు కల్పించేలా టాటా ఏఐజీ, నయా వెంచర్  సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.

 టీ-హబ్‌తో ఎంవోయూలు
 స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్‌తో కలసి పనిచేసేందుకు ఐసీఐసీఐ, హెచ్‌పీఈ, సిస్కో, టీఐఈ, హైసీ, ఐఏఎంఏఐ, టాలెంట్ స్ప్రింట్, ఇన్‌సైడ్ వ్యూ, ఎస్ బ్యాంక్ సంస్థలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇక టాస్క్‌తో కలసి పనిచేసేందుకు శాప్ ఎడ్యుకేషన్, మైక్రోసాఫ్ట్ ఇండియా, సిస్కో, సీడాక్, ఐసీఐసీఐ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి తదితర సంస్థలు ముందుకొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement