సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇంటర్ బోర్డును దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యాపా రాన్ని తగ్గించి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. కార్పొరేట్ ర్యాం కులకు పోటీగా ప్రభుత్వ కాలేజీలకు ర్యాంకులు రావాలని, ఆ దిశగా అధ్యాపకులు పనిచేయాల ని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు పెరగడానికి లెక్చరర్ల కృషే ప్రధాన కారణమన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం నేతలు పాల్గొన్నారు.
జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిగా మధుసూదన్‌రెడ్డి..
సదస్సు అనంతరం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడేళ్లపాటు నూతన కార్యవర్గం అమల్లో ఉంటుందని నేతలు వెల్లడించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పి.మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాబూరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా రామానుజాచారి, సంయుక్త కార్యదర్శిగా లక్ష్మణ్‌రావు, ఆర్థిక కార్యదర్శిగా కవితా, మహిళా కార్యదర్శిగా సుధారాణితోపాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ఉచిత కోచింగ్
Published Wed, Jan 3 2018 3:17 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment