Government Junior Colleges
-
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే సైన్స్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. వీరిని ఉత్తమంగా తీర్చిదిద్ది పోటీ పరీక్షలకు సిద్ధంచేస్తోంది. గత ఏడాది ఆగస్టులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు రెండు కళాశాలల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో 3 వేల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్‌కు శిక్షణనిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు 800 మందికి శిక్షణనిచ్చి, వారి సూచనల మేరకు విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎంబైబ్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. సైన్స్, మ్యాథమెటిక్స్ తరగతులకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలను ఈ సంస్థ అందిస్తోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఏడాది జరిగే ఏపీఈఏపీ సెట్, నీట్, జేఈఈ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా శిక్షణలో అవసరమైన మార్పులుచేసి రాష్ట్రంలోని 470 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను ఈ శిక్షణను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. స్వచ్ఛంద బోధనకు లెక్చరర్ల అంగీకారం.. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్ శిక్షణకు ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు వెంబైబ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో సాధాసాధ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్ బోర్డు లెక్చరర్ల సహకారం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి ఆసక్తిగల 10 మందిని ఎంపిక చేసి, వారికి ఎంబైబ్ సంస్థ పరిశీలన కోసం మెటీరియల్‌ను పంపించింది. వీడియో పాఠాలు, నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించిన అనంతరం వారు సూచించిన మార్పులు చేసి శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఖరీదైన ఐఐటీ, నీట్ వంటి శిక్షణను అందించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 800 మంది జూనియర్ లెక్చరర్లు ముందుకొచ్చారు. వారికి నిపుణులతో శిక్షణపై ఇంటర్ బోర్డు పూర్తి అవగాహన కల్పించింది. రెగ్యులర్ పాఠాలు పూర్తయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, ఏపీఈఏపీ సెట్.. బైసీసీ విద్యార్థులకు నీట్, ఈఏపీ సెట్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఎఫ్‌పీలపై 3డీలో వీడియో పాఠాలు.. మెటీరియల్‌తో పాటు సబ్జెక్టు వారీగా వందలాది వీడియో పాఠాలను ఎంబైబ్ సంస్థ అందించింది. నాడు–నేడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించింది. మరికొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి. వీటిద్వారా విద్యార్థులకు 3డీలో సైన్స్ వీడియో పాఠాలను బోధిస్తున్నారు. పాఠం పూర్తయ్యాక టాపిక్ వారీగా ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో స్వయంగా టాపిక్ల వారీగా టెస్టు పేపర్లు తయారుచేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చారు. గతంలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, ఏ తరహా ప్రశ్నలు రావచ్చో ఈ టెక్నాలజీ వివరిస్తోంది. గతంలో హెచ్‌సీఎల్ నిర్వహించిన “టెక్ బీ’ ప్రోగ్రామ్‌కు 4,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 900 మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న జేఈఈ, నీట్‌లోను విద్యార్థులు విజయం సాధిస్తారని ఇంటర్మీడియట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
మన బడి నాడు-నేడుతో పాఠశాలల్లో ఆధునిక వసతులు
-
AP: జూనియర్ కాలేజీలకు మహర్దశ
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు సంకల్పించింది. నాడు–నేడు రెండో దశ కింద రాష్ట్రంలో 468 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.280 కోట్ల వ్యయం చేయనుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో కాలేజీ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి.. వీటి ఆధ్వర్యంలో కాలేజీల్లో నాడు–నేడు కింద పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేపట్టే నాడు–నేడు పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. మార్గదర్శకాలు ఇవి.. ► ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా పనులు, ఇతర మేజర్, మైనర్ పనులు, కాలేజీ క్యాంపస్‌కు పెయింటింగ్, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, క్లాస్ రూమ్ ఫర్నీచర్, గ్రీన్ చాక్బోర్డు, కాంపౌండ్ వాల్ పనులను చేపట్టాలి. ► కాలేజీ ప్రిన్సిపాల్ కన్వీనర్‌గా.. విద్యార్థుల తల్లిదండ్రులతో మొత్తం 8 మంది సభ్యులతో కాలేజీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. ఇద్దరు కాలేజీ విద్యార్థుల తల్లులు, ఒక విద్యార్థి తండ్రి, క్రియాశీలకంగా ఉండే ఇద్దరు అధ్యాపకులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, ఇంజనీర్, దాతలు ఎవరైనా ఉంటే వారు కమిటీ సభ్యులుగా ఉంటారు. ► కమ్యూనిటీ కాంట్రాక్ట్ విధానంలో అభివృద్ధి కమిటీలు నాడు–నేడు పనులను చేపట్టాలి. ► కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యుల పేరుతో జాయింట్ బ్యాంకు ఖాతాను తెరవాలి. కాలేజీ దగ్గరలో ఏ బ్యాంకులో ఖాతా తెరవాలో కమిటీ సమావేశమై తీర్మానం చేయాలి. దీని ప్రకారం.. కాలేజీ అభివృద్ధి కమిటీ పేరుతో ఆ బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే సంబంధిత కాలేజీ నాడు–నేడు పనులకు నిధులను ఖర్చు పెట్టాలి. చెక్‌ల ద్వారానే చెల్లింపులు చేయాలి. చెక్‌లపై ప్రిన్సిపాల్ సంతకంతో పాటు మిగతా ఏడుగురు సభ్యుల సంతకాలు తప్పనిసరి. ► నాడు–నేడు పనులను స్థానిక మేస్త్రీ, కూలీల ద్వారా చేపట్టాలి. అవసరమైన సామగ్రిని కూడా స్థానికంగానే ప్రభుత్వం నిర్ధారించిన ధరకు కొనుగోలు చేయాలి. కమిటీ నిర్ధారించిన ధరలను మినిట్స్ బుక్‌లో రికార్డు చేయాలి. ఈ విషయంలో ఇంజనీర్.. కమిటీకి తగిన సూచనలు చేయాలి. ► కమిటీ సభ్యులంతా వారంలో ఒక రోజు కాలేజీలో సమావేశం కావాలి. కాలేజీలో చేపట్టాల్సిన పనులు, మౌలిక వసతులపై నిర్ణయం తీసుకోవాలి. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించకూడదు. ► కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకే సామగ్రి కొనుగోలు, బిల్లుల చెల్లింపులు జరగాలి. ప్రతి చెల్లింపులకు కమిటీ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. ఖర్చు చేసిన ప్రతి రూపాయి, పనులకు సంబంధించిన వివరాలన్నీ పక్కాగా పుస్తకంలో నమోదు చేయాలి. ► పనులకు మెటీరియల్ కొనుగోలు కోసం కమిటీ సభ్యులందరూ మార్కెట్‌కు వెళ్లి మెటీరియల్ నాణ్యత, ప్రమాణాలను స్వయంగా పరిశీలించాలి. ► నాడు–నేడు కార్యక్రమంలో వినియోగించే మెటీరియల్ కనీసం 75 ఏళ్లపాటు మన్నికతో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యుల సూచనల మేరకు ఇంజనీర్ అంచనాలను రూపొందించాలి. ► పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి. -
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతారు!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ షీ టీమ్స్ సరికొత్త కార్యాచరణను రూపొందించింది. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బాలమిత్ర కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను బాలమిత్రులుగా ఎంపిక చేసి, కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే బాలమిత్రుల విధి అని సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపారు. ► 2019 ఫిబ్రవరి 15న అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బాలమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా కారణంగా ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో రెండేళ్ల పాటు బాలమిత్ర కార్యక్రమం తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం భౌతిక పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తిరిగి బాలమిత్ర ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 1,650 మంది టీచర్లు బాలమిత్రలుగా నమోదయ్యారు. వీరిలో కొంతమంది టీచర్లు బదిలీ కాగా.. మరికొందరు రిటైర్డ్ అయ్యారు. దీంతో తాజాగా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలమిత్రలు ఏం చేస్తారంటే? పోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తారు. చట్టంలోని శిక్షలు, కేసులు నమోదైతే ఉజ్వల భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో వివరిస్తారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వివరించి, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలో శిక్షణ ఇస్తారు. తల్లిదండ్రులు, టీచర్లతో స్వేచ్ఛగా అన్ని అంశాలు బెరుకు లేకుండా చర్చించే విధంగా సంసిద్ధులను చేస్తారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌ను ఎంత వరకు వినియోగించాలి? అతి వినియోగంతో కలిగే అనర్థాలను వివరిస్తారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ.. పాఠశాల స్థాయిలో బాలమిత్ర కార్యక్రమం 8, 9, 10 తరగతుల కోసం రూపొందించారు. ఈ ఏడాది నుంచి సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎంపిక చేసిన పలు ప్రైవేట్ స్కూల్స్‌లోనూ బాలమిత్రలను ఏర్పాటు చేస్తారు. (క్లిక్: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్ కావాలి!) -
వేతన బకాయిల్లేవు.. రెన్యూవల్ లేదు
సాక్షి ప్రతినిధి నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా కారణంగా కాలేజీలు బంద్ కావడంతో ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. గతేడాది పనిచేసిన కాలపు బకాయిలను ఇవ్వకపోవడంతోపాటు ఇప్పుడు కాలేజీలను తెరిచినా విధుల్లోకి తీసుకోకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను ఇటీవల ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. డిగ్రీ అధ్యాపకుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు సబెక్టు బోధించే అధ్యాపకులు లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అవసరం ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 128 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 1,200 మంది రెగ్యులర్ లెక్చరర్లు, 830 కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వారు కాకుండా అదనంగా మరో 1,940 మంది లెక్చరర్ల అవసరం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లను కొనసాగిస్తున్నారు. 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల అవసరం ఉన్నా గత ఏడాది 719 మంది గెస్ట్ లెక్చరర్లనే ఆన్లైన్ బోధన కోసం తీసుకున్నారు. వారికి ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్ల చొప్పున నెలకు రూ.21,600 గరిష్టంగా చెల్లిస్తున్నారు. గతేడాది రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లతోపాటు గెస్ట్ లెక్చరర్లు కూడా ఆన్లైన్ బోధన చేపట్టారు. వారికి ఆ పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాలు ఇప్పటివరకూ అందలేదు. అప్పులు చేసి పూట వెళ్లదీయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నెల రోజులు అవుతున్నా.. ఈ విద్యా సంవత్సరంలో గత నెలలో వివిధ యూనివర్సిటీల పరిధిలో తరగతులు ప్రారంభమయ్యాయి. అయినా గెస్ట్ లెక్చరర్లను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఉపాధి ఉంటుందా? లేదా? అన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాల వారీగా గతేడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల సంఖ్య ఇలా.. ఆదిలాబాద్–3, భద్రాద్రి కొత్తగూడెం–17, హైదరాబాద్–133, జగిత్యాల–10, జనగామ–6, జయశంకర్ భూపాలపల్లి–8, జోగులాంబ గద్వాల–32, కామారెడ్డి–29, కరీంనగర్–27, ఖమ్మం–18, కొమురంభీం ఆసిఫాబాద్–6, మహబూబాబాద్–14, మహబూబ్‌నగర్–51, మంచిర్యాల–11, మెదక్–17, మేడ్చల్–14, ములుగు–6, నాగర్‌కర్నూలు–32, నల్లగొండ–46, నారాయణపేట్–17, నిర్మల్–5, నిజామాబాద్ –31, పెద్దపల్లి–10, రాజన్న సిరిసిల్ల–3, రంగారెడ్డి–16, సంగారెడ్డి–45, సిద్దిపేట–51, సూర్యాపేట–4, వికారాబాద్–16, వనపర్తి–20, వరంగల్ రూరల్–3, వరంగల్ అర్బన్–13, యాదాద్రి భువనగిరి–5 -
నేనున్నానని.. నీకేం కాదని
సాక్షి, నేలకొండపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, బాగా చదువుకునేందుకు వారి ఆటంకాలను అధిగమ విుంచేలా ప్రోత్సహించేందుకు సరికొత్త విధానం అమలు చేస్తున్నారు. మనోధైర్యన్ని నింపి, వారిని మానసికంగా దృఢంగా చేసేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరీక్షలు, ఫలితాల భయం, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై బలవన్మరానికి పాల్పడకుండా..మేమున్నామంటూ..వ్యక్తిత్వ వికాసంతో వారిలో ధైర్యం నూరిపోయనున్నారు. కళాశాలలోని సీనియర్ అధ్యాపకులే కౌన్సిలర్ల మాదిరి వ్యవహరించేలా, పిల్లలకు చేయూతనిచ్చేలా ఇప్పటికే ఇంటర్మిడియట్ బోర్డు శిక్షణ కూడా ఇవ్వడంతో వారంతా సిద్ధంగా ఉన్నారు. ఫలితంగా జిల్లాలోని 19 జూనియరల్ కళాశాలల్లో వీరు తమ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కౌన్సిలర్లు ఏం చేస్తారంటే..? అధైర్య పడొద్దు.. చక్కగా చదవాలి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. తక్కువ మార్కులు వస్తే సబ్జెక్ట్ ఆధ్యాపకుడితో కౌన్సిలర్ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. లోపాలు వివరించి, అధిగవిుంచేందుకు పాటించాల్సిన పద్ధతులను తెలిపి వెన్నుతడతారు. తల్లిదండ్రులను కళాశాలకు పిలిచి..తగిన సూచనలు చేస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా కుంగిపోవద్దని ధైర్యం నూరిపోస్తారు. సానుకూల దృక్పథం, స్థిర ఆలోచనలనుపెంచుకునేలా మారుస్తారు. కుటుంబ పరిస్థితిపై సునిశిత పరిశీలన.. పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడి.. కుటుంబ నేపథ్యం తెలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు, చదువులో ఎలా ఉన్నారు? అనేది ఓ అంచనాకు వస్తారు. వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఏ సబ్జెక్ట్ లో వెనకబడ్డారు? అనే విషయాలను కూలంకశంగా తెలుసుకుంటారు. కాలేజీకి రాకుంటే..కారణాలు తెలుసుకుని పునరావృత్తం కాకుండా సూచనలు చేస్తారు. విద్యార్థులతో భేటీ కళాశాలల్లో రోజు వారి కార్యక్రమాలతో పాటు పిల్లలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అధిక మార్కులు సాధించేందుకు మెళకువలు వివరిస్తారు. జ్ఞాపకశక్తి పెంపు, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి..అనేతదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతి విద్యార్థితో వ్యక్తిగతంగా మాట్లాడతారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు-19 కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎంపికైన సీనియర్ అధ్యాపకుల సంఖ్య- 19 రోజూ కౌన్సెలింగ్.. ప్రతిరోజూ కాలేజీకి రాగానే విద్యార్థుల పరిస్థితులను గుర్తిస్తాను. ఎవరైతే డల్లుగా ఉంటారో, మానసిక ఒత్తిడికి గురవుతుంటారో వారిలో ధైర్యాన్ని నింపే విధంగా కౌన్సెలింగ్ చేస్తున్నా. ఇందుకు తగ్గట్టుగా మానసిక నిపుణులు నాకు..వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఆ తరహాలోనే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా. – వై.సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్, నేలకొండపల్లి మనోధైర్యాన్ని కలిగించేందుకే.. మానసిక ఆందోళన, ఒత్తిడి అనేది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగవిుంచేందుకు ఇంటరీ్మడియట్ బోర్డు కౌన్సిలర్లను నియమించింది. ఆత్మ విశ్వాసం పెంపోందించడమే దీని లక్ష్యం. – రవిబాబు, డీఐఓ, ఖమ్మం మార్పు కనిపిస్తోంది.. మా కాలేజీలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ప్రతిరోజూ డల్‌గా ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు చాలా ఫ్రీగా, నమ్మకంగా విషయాలను వివరించగలుగుతున్నారు. – ఎస్ఎన్.శాస్త్రి, ప్రిన్సిపాల్, నేలకొండపల్లి -
త్వరలో టెట్, డీఎస్సీ ప్రకటన
తిరువూరు: ఈ ఏడాది టెట్, డీఎస్సీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 2018 డీఎస్సీలో న్యాయ వివాదాలతో నిలిచిపోయిన నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. గతంలో కొన్ని డీఎస్సీల్లో నెలకొన్న సమస్యలను కూడా సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వాలు కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు చేసినా అధ్యాపక పోస్టులకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో తాత్కాలిక ప్రాతిపదికపై నియామకాలు జరిగాయని, కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం అనుసరిస్తోందన్నారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను ఏ మేరకు భర్తీ చేయాలో పరిశీలించి త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామన్నారు. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలివిడత రూ.3,600 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ అమలవుతుందన్నారు. ఇందుకు అదనంగా రూ.300 కోట్లు ఏటా ఖర్చవుతుందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇష్టానుసారం వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు. -
కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్ భవనం
-
మాకొద్దీ ఉచిత విద్య!
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఊడ్చేందుకు చీపుర్లు లేవు. టాయిలెట్లు శుభ్రం చేసేవాళ్లు లేరు. చాక్‌పీసులకు పైసల్లేవ్. డస్టర్లకు డబ్బుల్లేవ్. టీచింగ్ డైరీల్లేవు. ఇందుకు ఏకైక కారణం కాలేజీలో డబ్బుల్లేకపోవడమే. ఈ దుస్థితి ఆ ఒక్క కాలేజీకే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పెట్టిన ‘ఉచిత విద్య’కారణంగా విద్యార్థుల నుంచి పైసా వసూలు చేయడానికి వీల్లేదు. కాలేజీలకు డబ్బులు ఇప్పిస్తామన్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ఫీజులు వసూలు చేయనపుడు రీయింబర్స్ ఎలా చేస్తామని సంక్షేమ శాఖలు చేతులెత్తేశాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. ప్రిన్సిపాళ్ల ఆందోళన ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహణలో ప్రిన్సిపాళ్లు తంటాలు పడుతున్నారు. చాక్‌పీసులకు నిధుల్లేక అల్లాడుతున్నారు. కాలేజీల ఆవరణ, ప్రిన్సిపాల్, సిబ్బంది గదులు, తరగతి గదులను ఊడ్చే దిక్కులేదు. కాలేజీల్లో టాయిలెట్లను శుభ్రం చేయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆందోళనకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల సమావేశమై తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కాలేజీలను తాము నిర్వహించలేమంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతా ఉచిత విద్య చలవే! నాలుగేళ్ల కిందట జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్యను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో 2016–17 విద్యా సంవత్సరం నుంచి ఆయా కాలేజీల్లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలేదు. అప్పట్లో ఉన్న 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,15,111 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు అయినందునా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు ప్రతి విద్యార్థి నుంచి సైన్స్ విద్యార్థులైతే రూ.893, ఆర్ట్స్ విద్యార్థులైతే రూ.533 కాలేజీలు వసూలు చేసేవి. అయితే 2016 జనవరి 7వ తేదీన జారీ చేసిన జీవో 2లో ఆ మొత్తాన్ని కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. సంక్షేమ శాఖలు ఇవ్వాలని చెప్పినా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ ఉచిత విద్య కారణంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 404 జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు చేరింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం కాలేజీలు విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజులను వసూలు చేయవద్దని, కాలేజీలు తమ ఖర్చులను కంటింజెన్సీ ని«ధులతోపాటు సంక్షేమ శాఖలు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వెళ్లదీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పైగా ఆర్థిక శాఖ, సంక్షేమ శాఖలతో సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ జీవోలో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రభుత్వం ఒక్కో కాలేజీకి ఇస్తున్న కంటింజెన్సీ నిధులు ఒకనెల ఎలక్ట్రిసిటీ బిల్లుకు కూడా సరిపోవడం లేదని ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. మరోవైపు సంక్షేమ శాఖలు చేతులెత్తేశాయి. కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనపుడు తాము ఎందుకు రీయింబర్స్మెంట్ ఇస్తామని మెలిక పెట్టాయి. దీంతో విద్యార్థుల నుంచి స్పెషల్ పీజుల రూపంలో వచ్చే మొత్తం రాకపోగా, సంక్షేమ శాఖలు కూడా ఇవ్వక కాలేజీల నిర్వహణ కష్టంగా మారిపోయింది. ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఉచిత ఇంటర్మీడియట్ విద్యాపథకం ప్రవేశ పెట్టడానికి ముందు విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు కాలేజీల అకౌంట్లలో ఉన్నాయి. దీంతో ఇన్నాళ్లు సంక్షేమ శాఖలు డబ్బులు ఇవ్వకపోయినా ఆ నిధులతో ప్రిన్సిపాళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు తాము తాము నిర్వహించలేమంటూ చేతులెత్తేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయా కాలేజీల్లోని నిధులు అయిపోయి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ నుంచి పైసా రాక పోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి రాష్ట్రంలో 100 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 1500 మంది, 2 వేల మంది విద్యార్థులు ఉన్న కాలేజీలూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2 లక్షల మంది విద్యార్థులున్నారు. 300 మంది విద్యార్థులు ఉన్న కాలేజీని తీసుకుంటే.. ఏటా (కాలేజీ నడిచే 10 నెలలకు)వెచ్చించాల్సిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. రూ.20వేలు అటెండర్‌కు, రూ.20వేలు స్వీపర్‌కు, రూ. 20వేలు బాత్రూమ్లు కడిగేవారికి, రూ. 20వేలు నైట్ వాచ్‌మెన్‌కు, రూ.20వేలు కరెంటు బిల్లు (కంప్యూటర్లు, ఆర్వో ప్లాంటు ఉన్న కాలేజీల్లో నెలకు 2 వేల చొప్పున)కు, రూ.10వేలు చాక్ పీసులు, డస్టర్లు, రిజిసర్టర్లకు, రూ.5వేలు ఇంటర్నెట్ ఛార్జీలు, రూ.20వేలు కార్యక్రమా లకు ( జూన్ 2, ఆగస్టు 15, జనవరి 26, కాలేజ్ డేలకు అథమంగా రూ.5 వేల చొప్పున వెచ్చిస్తేనే. కానీ ఒక్కో ఫంక్షన్ చేస్తే రూ.10 వేలకు పైనే అవుతుంది) ఖర్చవుతోంది. ఏటా కనీసం రూ.1.25 లక్షలు ఇలా కనీసంగా లెక్కలేసుకున్నా ఒక్కో కాలేజీ నిర్వహణకు హీనపక్షంలో ఏటా రూ.1.25లక్షలు అవసరం. కానీ రాష్ట్రంలో 500 నుంచి మొదలుకొని 2వేల వరకు విద్యార్థులున్న కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. వీటి అవసరాలకోసం కోసం కనీసం రూ.1.5లక్షల నుంచి 2లక్షల వరకు వెచ్చించాల్సిందే. అయినా ఇంటర్మీడియట్ విద్యాశాఖ పైసా ఇవ్వడం లేదు. కంటింజెన్సీ కింద ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ బిల్లులు ఒక నెలకు కూడా సరిపోవడం లేదు. సంక్షేమ శాఖలు ఇస్తాయన్న నిధులను రాకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఆర్థిక కష్టాల్లో పడ్డాయి. -
గుర్తింపు లేని కాలేజీలు.. 1,338
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా తంటాలు తప్పడం లేదు. అనుబంధ గుర్తింపు కోసం ఏయే సర్టిఫికెట్లు అందజేయాలన్న విషయం కాలేజీ యాజమాన్యాలకు తెలిసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అత్యధిక ప్రైవేటు జూనియర్ కాలేజీలు వ్యవహరించడం లేదు. బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం గతేడాది డిసెంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించినా కాలేజీలన్నీ నిర్దేశిత సర్టిఫికెట్లను అందజేయలేదు. దీంతో రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు కూడా వాటిని ఇవ్వకపోవడంతో 1,338 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండా పోయింది. అయితే ఆయా కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. చివరకు విద్యార్థులు భవిష్యత్ పేరుతో అనుబంధ గుర్తింపు పొందేందుకు ఆయా యాజమాన్యాలు చర్యలు వేగవంతం చేశాయి. అందులో 75 కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అత్యధికంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు చెందినవే కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇంటర్ బోర్డు పరిధిలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కాకుండా పాఠశాల విద్యా శాఖ, సంక్షేమ శాఖల పరిధిలో మరో 558 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 492 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మరో 66 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల గుర్తింపు ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రైవేటు కాలేజీలు 2,155 ఉండగా, వాటిల్లో 1,699 కాలేజీలే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లో 361 కాలేజీలకు షరతులతో కూడిన అనుబంధ గుర్తింపును బోర్డు జారీ చేసింది. వాటిలోనూ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు లేరు. 3 నెలల్లో నియమించుకుంటామన్న షరతుతో వాటికి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. మిగతా 1,338 కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. చివరకు శానిటేషన్ సర్టిఫికెట్లూ లేవు.. రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలకు రిజిస్టర్ లీజ్ డీడ్, ఫిక్స్డ్ డిపాజిట్ రెన్యువల్, స్ట్రక్చరల్ సౌండ్ నె‹స్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, ఆట స్థలాలు లేవు. సరిగ్గా ఫ్యాకల్టీ లేరు. గతేడాది అంతకుముందు ఇచ్చి న అనుబంధ గుర్తింపు ఫీజులను చెల్లించలేదు. శానిటరీ, హైజీన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ కారణాలతో 1,338 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇందులో ఐదారు ఫ్లోర్లు కలిగిన భవనాల్లో నడుపుతున్న 75 కార్పొరేట్ కాలేజీలున్నా యి. వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందినవి 25, నారాయణ విద్యా సంస్థలకు చెందినవి 26, శ్రీగాయత్రి విద్యా సంస్థలకు చెందినవి 8, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందినవి 4, ఇతర విద్యా సంస్థలకు చెందినవి 12 ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కాలేజీలు అన్నింటికి అనుబంధ గుర్తింపు లేకపోవడం, విద్యార్థులను చేర్చుకున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. మరో వారం సమయం ఇస్తాం: అశోక్ అనుబంధ గుర్తింపు తీసుకోని విద్యా సంస్థలకు మరో వారం గడువు ఇస్తామని ఇంటర్ బోర్డు కార్యద ర్శి అశోక్ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుబంధ గుర్తిం పు ప్రక్రియను నిలిపివేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపారు. ఆయా విద్యా సంస్థలన్నీ తమకు కాలేజీలకు సంబంధించిన నిర్ధేశి త సర్టిఫికెట్లను అందజేసి అనుబంధ గుర్తింపు పొం దాలన్నారు. అలా గుర్తింపు పొందని విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అందులో 194 కాలేజీలకు అనుబందంగా హాస్టళ్లు ఉన్నాయని వివరించారు. హాస్టళ్ల గుర్తింపు విషయంలో కేసు కోర్టులో ఉన్నందు న ఆ విషయం జోలికి వెళ్లడం లేదన్నారు. -
కాలేజీల్లో ‘భోజనం’ ఊసేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి చందంగా తయారైంది. రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన దీని అమలుపై ఇటీవల కద లిక రావడంతో ఇక కచ్చితంగా పథకం అమల్లోకి వస్తుందని అంతా భావించారు. మంత్రుల కమి టీ ఏర్పాటు, భోజనం అందించే సంస్థతో కమిటీ సంప్రదింపులు జరపడం, మంత్రులు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడటమూ జరిగిపోయింది. సమగ్ర ప్రతిపాదనలను ఈ నెల 6న సమర్పించాలంటూ కమిటీ పేర్కొనడంతో పథకం ప్రారంభం లాంఛనమే అనే స్థాయిలో హడావుడి జరిగింది. అయితే 2 వారాలైనా మధ్యాహ్న భోజనం అమలు ఊసే లేదు. దీంతో రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 2 లక్షల మంది విద్యార్థులకు, డిగ్రీ, మోడల్ స్కూల్స్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లోని మరో 1.6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుకు నోచుకుంటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆగస్టు 15 నుంచే పథకాన్ని అమలు చేసేలా తొలుత కసరత్తు జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రతిపాదనలకే పరిమితం... ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, డిగ్రీ, ఐటీఐ కాలేజీల్లో చదివే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో చదువుతున్న వారిలోనూ నిరుపేద విద్యార్థులు ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే అత్యధికం. అలాంటి వారికి మధ్యాహ్న భోజనం అందిస్తే కాలేజీకి రోజూ రావడంతోపాటు బాగా చదువుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అంతేకాదు పనులకు వెళ్లే విద్యార్థులను చదువు వైపు మళ్లించవచ్చని అనుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూడీసీ) అధికారులను సంప్రదించి పథకం అమలుకు ఖర్చు అంచనాల వివరాలను తెప్పించారు. పథకం పనులకు రూ. 42 కోట్లు అవసరం అవుతాయని పేర్కొంటూ టీఎస్‌డబ్ల్యూడీసీ ఫైలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా ఆర్ఐడీఎఫ్ నిధుల నుంచి ఆ మొత్తాన్ని కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు రోజువారీ నిర్వహణ, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఏటా రూ. 201 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేశారు. అంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని 2016 నుంచి ఈ ఫైలును పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల మళ్లీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టింది. ఇంటర్మీడియెట్‌తోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్, మోడల్ స్కూల్స్ విద్యార్థులకూ భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని భావించింది. ఇందులో భాగంగా భోజనం అందించే ఏజెన్సీతోనూ చర్చలు జరిపారు. దాదాపు 3.60 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందన్న వివరాలతో ప్రతిపాదనలను ఇవ్వాలని మంత్రుల కమిటీ కోరింది. ఆగస్టు 6వ తేదీన ఆ ప్రతిపాదనలను అందజేయాలని పేర్కొంది. కానీ ఆ తరువాత నుంచి భోజనం అమలు విషయంలో కదలిక లేకుండాపోయింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో పథకాన్ని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయవద్దని, వీలైనంత త్వరగా పథ«కాన్ని అమలు చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నిధులూ లేవు.. సార్లూ లేరు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అవసరమైన లెక్చరర్ పోస్టులు భర్తీకాలేదు. గెస్ట్ లెక్చరర్ల నియామకంపై సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. సార్లు రాక కోసం విద్యారులు ఎదురు చూపులు చూడటం తప్ప పాఠాలు ముందుకు సాగ ట్లేదు. మరోవైపు కాలేజీల ఖాతాల్లో నిధులు లేక కనీ సం చాక్‌పీస్, డస్టర్లు కూడా కొనలేని పరిస్థితి. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల దుస్థితి. కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కు రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 1.7 లక్షల మంది వరకు ఉంటారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా లెక్చరర్లు మాత్రం లేరు. మెజార్టీ కాలేజీలు కాంట్రాక్టు లెక్చరర్లతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. గతేడాది జూనియర్ లెక్చరర్లకు పదో న్నతి ఇచ్చారు. దీంతో అన్ని కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఉన్నారు. కానీ లెక్చరర్లకు మాత్రం కొరత ఏర్పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలో జూనియర్ లెక్చరర్లను బదిలీ చేయడంతో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోని జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసి న వారిని ఈ ఏడాది కూడా కొనసాగించాలా లేదా అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఆ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల సంగతిని కూడా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీంతో వారూ అసంతృప్తితో ఉన్నారు. కాలేజీల ఖాతాలు ఖాళీ గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి సైన్స్ గ్రూపులకు రూ.835, హ్యుమానిటీస్ గ్రూపులకు రూ.530 చొప్పున వసూలు చేసి కాలేజీ ఖాతాలో జమ చేసేవారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ నుంచి రూ.350 ట్యూషన్ ఫీజుగా కాలేజీలు మినహాయించుకునేవి. దీంతో ఒక్కో కాలే జీ ఖాతాలో ‘అక్యుములేషన్ ఫీజు’రూపంలో సగటు న రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు నిల్వ ఉం డేవి. 2016–17 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు పరికరాల కోసం రూ.1.58 లక్షలు చొప్పున ‘అక్యుములేషన్’ ఖాతా నుంచి ఖర్చు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. 2011–12లో కొత్తగా మంజూరైన 102 జూనియర్ కాలేజీలకు కూడా పాత కాలేజీల అక్యుములేషన్ నిధులనే వినియోగించడంతో ఆయా కాలేజీల ఖాతాలు దాదాపు ఖాళీ అయ్యాయి. దీంతో ‘డే టు డే’నిధుల పేరిట కాలేజీల నిర్వహణకు 2017–18లో నిధులు ఇస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటిం చింది. అయితే విద్యా సంవత్సరం ముగిసినా నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో కాలేజీల్లో చాక్‌పీసులు, డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ‘దహెగాం’ దయనీయ గాథ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ‘దహెగాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ’ 18 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది నేటికీ జెడ్పీ స్కూల్ భవనంలోనే కొనసాగుతోంది. గతంలో రెండు గదుల షెడ్డు నిర్మించినా కరెంటు, తాగునీరు, ఫర్నిచర్ లేకపోవడంతో నిరుపయోగం గా మారాయి. గతేడాది పదోన్నతిపై వచ్చిన ప్రిన్సిపాల్ ఈ షెడ్డును వినియోగంలోకి తెచ్చి స్టాఫ్‌రూం, ప్రయోగశాల ఏర్పాటు చేశారు. తరగతులు మాత్రం శిథిలావస్థకు చేరిన హైస్కూల్ గదుల్లోనే నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది రెగ్యులర్ లెక్చరర్లకు గాను ఒక్కరూ లేక పోగా, 8 మంది కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. కాలేజీ నిర్వహణకు తాను ఖర్చు చేసిన రూ.60 వేలు ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్ పలుమార్లు ఇంటర్ బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేదు. గజ్వేల్‌లోనూ అదే పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ బాలికల జూనియర్ కాలేజీలో 720 మంది విద్యార్థులున్నారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా అత్యాధునిక వసతులతో భవనం నిర్మించారు. అయితే ప్రిన్సిపాల్ మినహా ఒక్క రెగ్యులర్ లెక్చరర్ కూడా లేరు. కేవలం ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది 14 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించారు. ప్రస్తుతం వారు కూడా లేరు. రెగ్యులర్ లెక్చరర్లు, సీనియర్ అసిస్టెంట్, పీడీ, లైబ్రేరియన్, వాచ్‌మన్, స్వీపర్ పోస్టులతో పాటు, ఫర్నిచర్ కావాలని బోర్డుకు లేఖలు రాసినా స్పందన లేదు. పాఠాలు చెప్పే వారేరీ? కాలేజీలో 170 మందికి పైగా విద్యార్థులు ఉన్నా గణిత, భౌతిక శాస్త్రాలకు మినహా మిగతా సబ్జెక్టులకు రెగ్యులర్ లెక్చరర్లు లేరు.కాలేజీ తెరిచి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. లెక్చరర్లు లేక విద్యార్థులు కూడా రెగ్యులర్‌గా కాలేజీకి రావడం లేదు. లెక్చరర్లు వస్తారని ఎదురు చూస్తూనే రెండు నెలలు గడిచిపోయాయి. – రాములు, ఇంటర్ సెకండ్ ఇయర్, సదాశివపేట జూనియర్ కాలేజీ, సంగారెడ్డి న్యాయం చేయలేకపోతున్నాం జూనియర్ కాలేజీల్లో ప్రస్తు తం మౌలిక వసతులు కొంత మెరుగయ్యాయి. రెగ్యులర్ లెక్చరర్లు లేక, కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీ జరగక, నిర్వహణ నిధుల్లేక కాలేజీల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. ప్రభుత్వ కాలేజీల మీద భరోసాతో వస్తున్న పేద విద్యార్థులకు న్యా యం చేయలేకపోతున్నాం. గెస్ట్ లెక్చరర్ల నియామ కంతో పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. – కళింగ కృష్ణకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం -
ప్రభుత్వ కాలేజీల టాపర్లకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రతిభకు ప్రతిబింబాలని ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ అశోక్ పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకొని అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఆయన బంగారు పతకాలు, నగదు బహుమతులతో సత్కరించారు. టాపర్లకు సత్కారం.. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కాలేజీల నుంచి 985 మార్కులతో టాపర్‌గా నిలిచిన సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని జూలూరి శ్రీమేధకు రూ.50 వేల నగదు, బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే 982 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో ఉన్న సిద్దిపేట జిల్లా కోహెడ కాలేజీకి చెందిన కుంభం రమ్యకు రూ.40 వేల నగదుతోపాటు ప్రశంసాపత్రం, 978 మార్కులతో మూడో స్థానం పొందిన ఆదిలాబాద్ జిల్లా బో«ధ్‌కు చెందిన కె.హారికకు రూ.30 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే గ్రూపుల వారీగా, జనరల్, వొకేషనల్‌లో టాపర్లను సన్మానించారు. -
ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ఉచిత కోచింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇంటర్ బోర్డును దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యాపా రాన్ని తగ్గించి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. కార్పొరేట్ ర్యాం కులకు పోటీగా ప్రభుత్వ కాలేజీలకు ర్యాంకులు రావాలని, ఆ దిశగా అధ్యాపకులు పనిచేయాల ని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు పెరగడానికి లెక్చరర్ల కృషే ప్రధాన కారణమన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం నేతలు పాల్గొన్నారు. జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిగా మధుసూదన్‌రెడ్డి.. సదస్సు అనంతరం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడేళ్లపాటు నూతన కార్యవర్గం అమల్లో ఉంటుందని నేతలు వెల్లడించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పి.మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాబూరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా రామానుజాచారి, సంయుక్త కార్యదర్శిగా లక్ష్మణ్‌రావు, ఆర్థిక కార్యదర్శిగా కవితా, మహిళా కార్యదర్శిగా సుధారాణితోపాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
సదువులు సగం!
సమస్యలు అధికం జూనియర్ కళాశాలలో విడతలవారీ బోధన అస్తవ్యస్త తరగతులతో ఇక్కట్లు శిథిలమైన బాలికల కళాశాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల అవస్థ మెదక్ జోన్: విడతలవారీ బోధన.. విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తోంది. ఒకే కళాశాలలో ఉదయం బాలికలకు, మధ్యాహ్నం వేళ బాలురకు తరగతులు బోధిస్తున్నారు. సమయభావంతో అరకొరగా జరుగుతున్న తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరకొర చదువులతో వారి భవిష్యత్తు సందిగ్ధంలో పడుతోంది. మెదక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని నలభై ఏళ్ల క్రితం నిర్మించారు. అందులోనే కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆ భవనంలోనే దాదాపు 550మంది విద్యార్థినులు చదువుకుంటుండగా.. గత నెల మొదటివారంలో భారీ వర్షాలకు కళాశాలలోని గదులన్నీ దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. ఓ గది పూర్తిగా కూలిపోయింది. ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పట్టణంలోని బాలుర కళాశాలలోకి తరలించాలని చెప్పారు. వారి ఆదేశాలతో విద్యార్థులను అక్కడకు తరలించారు. రెండు కళాశాలల విద్యార్థులకు విడతల వారీగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. బాలికలకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు; బాలురకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బోధిస్తున్నారు. సమయాభావంతో అరకొరగా జరుగుతున్న తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధ్యాపకులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పునశ్చరణకు కూడా సమయం ఉండడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉదయం పూట సమయానికి బస్సులు అందుబాటులో లేక దూరప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థినులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో తరగతులకు హాజరు కాలేకపోతున్నామని పలువురు విద్యార్థినులు వాపోయారు. సర్ధన, కొత్తపల్లి, కొడుపాక, డి.ధర్మారం, రంగంపేట, గోపాల్పేట, గుండారం తదితర దూర ప్రాంతాల నుంచి బాలికలు మెదక్ పట్టణానికి కళాశాలకు వస్తూంటారు. సాయంత్రం వేళల్లోనూ కళాశాల సమయం కన్నా ముందే బస్సులు వెళ్లిపోయి విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 5.30గంటల వరకు తరగతులు జరుగుతుండడంతో బస్సులు దొరకడవం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు రెండు విడతల్లో నామమాత్రంగా చదువులు చెబుతూ కాలం వెళ్లదీస్తుండడంపై పలువురు అధ్యాపకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. తమకు మరేదైనా భవనాన్ని కేటాయించి యథావిధిగా కళాశాల నిర్వహణ కొనసాగించాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఇబ్బందులు తప్పడం లేదు కళాశాల భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో బాలుర కళాశాలకు తరలించాం. అక్కడ గదులు సరిపడా లేకపోవడంతో విడతల వారీగా తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కళాశాల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. రూ.26లక్షలు మంజూరు చేశారు. ఇప్పుడు టెండర్ దశలో ఉంది. టెండర్ పూర్తవగానే పనులు ప్రారంభమవుతాయి. రమాదేవి, ప్రిన్సిపాల్, బాలికల కళాశాల బస్సులు దొరకడం లేదు సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు జరగడంతో ఊరికి వెళ్లేందుకు బస్సులు దొరకడం లేదు. అన్ని బస్సులూ వెళ్లిపోవడంతో ఆటోలకు ఛార్జీలు చెల్లించి వెళ్లాల్సి వస్తోంది. ఇదివరకటి లాగే మాకు తరగతులు కొనసాగించాలి. శ్రీకాంత్, సెకండియర్ విద్యార్థి -
అన్నమో రామచంద్రా!
జూనియర్ కళాశాలల్లో అమలు కాని మధ్యాహ్న భోజనం ఎదురు చూస్తున్న 21,500 మంది విద్యార్థులు జూలై ఒకటి నుంచే ప్రారంభిస్తామన్న ప్రభుత్వం స్పష్టత ఇవ్వని విద్యాశాఖాధికారులు సంగెం : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అయోమయం నెలకొంది. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు జూనియర్ కళాశాలల్లో జూలై ఒకటి నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. అయితే నెల రోజులు దాటినా ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లలో ఆయా మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన బాలబాలికలు సైతం వస్తున్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థులు బస్సులు, లేదంటే ఆటోలు, సైకిళ్లపై, కాలినడకన కళాశాలలకు వచ్చి వెళ్తుంటారు. ఉదయం 9:30 గంటలకు కాలేజీకి రావాలంటే ఇంటి నుంచి 7–8 గంటల మధ్యనే బయలుదేరాల్సి వస్తోందని, తిరిగి వెళ్లేసరికి రాత్రి అవుతోందని, దీంతో మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు చెపుతున్నారు. -
చివరి స్థానంలో నల్లగొండ
ఇంటర్ ఫలితాల్లో కొనసాగిన ఆనవాయితీ * తెలంగాణలో చివరి స్థానంలో నిలిచిన జిల్లా * గత ఏడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో రెండు శాతం తగ్గిన ఉత్తీర్ణత * సెకండియర్‌లో ఒక శాతం పెరుగుదల.. రెండింటి ఫలితాల్లో బాలికలదే పైచేయి * వృత్తి విద్యాకోర్సుల్లో మాత్రం అగ్రస్థానం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు నల్లగొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా గత ఏడాది ఆనవాయితీనే కొనసాగించింది. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది. గత ఫలితాలతో పోలిస్తే విద్యార్థుల ఉత్తీర్ణత ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు శాతానికి పడిపోగా... ద్వితీయ సంవత్సరంలో మాత్రం ఒక శాతం పెరిగింది. వృత్తి విద్యాకోర్సుల ఫలితాలకు సంబంధించి జిల్లా... రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. అయితే.. ఎయిడెడ్ కాలేజీల్లో ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో 41 శాతం ఉత్తీర్ణత మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 33,775 మందివిద్యార్థులు హాజరుకాగా.. 13,879 మంది (41శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 17,522 మందికి గాను 8,139 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 16,253 మందికి గాను 5,740 మంది (35శాతం) ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ విభాగంలో 3,966 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 2,333 మంది (59 శాతం) పాసయ్యారు. బాలికలు 1,584 మందికి గాను 1,025 (65శాతం), బాలురు 2,382 మందికిగాను 1,308 (55శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 53 శాతం ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సర పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 34,354 మం ది విద్యార్థులు హాజరుకాగా.. 18,317 మంది (53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 17,393 మందికి గాను 10,065 మంది (58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 17,393 మందికి 8,252 మంది (49శాతం) పాస్ అయ్యా రు. ఒకేషనల్ విభాగంలో 3,186 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కాగా.. 2,257 మంది (71శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలి కలు 1147మందికి 876 మంది (76శాతం) .. బాలురు 2,0 39 మందికి 1,381 (68శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కాలేజీల ఫలితాలు.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే మెరుగైంది. జిల్లావ్యాప్తంగా 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో నుంచి ఫస్టియర్ విద్యార్థులు 4,917 మంది పరీక్షలకు హాజరు కాగా.. 1,899 మంది (39 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,486 మందికి గాను 856 మంది (34 శాతం).. బాలికలు 2,431 మందికి గాను 1,043 మంది (43 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,126 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,871 మంది (70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,175 మందికిగాను 1,500 (69 శాతం).. బాలికలు 1951 మందికిగాను 1371 మంది (70 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణతలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. 29 కాలేజీల్లో పది మాత్రమే.. జిల్లాలోని 29 ప్రభుత్వ కాలేజీల్లో పది కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించి టాప్ టెన్‌లో నిలిచాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు రావడంపై ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో... మొదటి సంవత్సరం ఫలితాల్లో నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 114 మంది విద్యార్థులకుగాను 109 మంది (96 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. భూదాన్‌పోచంపల్లి కాలేజీలో 137 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 117 మంది (85 శాతం) మంది.. తుంగతుర్తి కాలేజీలో 129 మందికి 109 మంది (84శాతం).. డిండి కాలేజీలో 168 మందికి 135 మంది (80శాతం), దేవరకొండ బాలికల జూనియర్ కాలేజీలో 129 మందికి 80 మంది (62 శాతం), నాంపల్లి కాలేజీలో 151 మందికి 90 మంది (60శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో.. నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 150 మంది (98 శాతం), తుంగతుర్తి కాలేజీలో 174 మందికి 163 మంది (94 శాతం), భూదాన్‌పోచంపల్లి కాలేజీలో 90 మందికి గాను 84 మంది (93 శాతం), డిండి కాలేజీలో 177 మందికి 162 మంది (92శాతం), చింతపల్లి కాలేజీలో 195 మందికి 177 మంది (91 శాతం), నడిగూడెం కాలేజీ లో 121 మందికి 109 మంది (90 శాతం), దేవరకొండ బాలుర కాలేజీలో 145 మందికి 128 మంది (88 శాతం), దేవరకొండ బాలికల కాలేజీలో 142 మందికి 123 మంది (87 శాతం), యాదగిరిగుట్ట కాలేజీలో 191 మందికి 165 మంది (85 శాతం), రామన్నపేట కాలేజీలో 114 మందికి 95 మంది (83 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఎయి‘డెడ్’.... ఇంటర్ ఫలితాల్లో ఎయిడెడ్ కాలేజీలు చతికిలపడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 283 మంది విద్యార్థులు హాజరుకాగా.. కేవలం 30 మంది (11శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 203 మందికి గాను 22 మంది (11శాతం), బాలికలు 80 మందికిగాను 8 మంది (10శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 241 మంది విద్యార్థులు హాజరు కాగా.. 55 మంది మాత్రమే (23శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 168 మందికిగాను 42 మంది (25శాతం), బాలికలు 73 మందికి గాను 13 మంది (18శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
కళాశాలపై నిఘా
{పభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు నూతన విద్యాసంవత్సరం నుంచి అమలు సిటీబ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరింత గాడిలోకి రానున్నాయి. బోధనలో పారదర్శకత తీసుకరావడం, హాజరు శాతం పెంచడానికి ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 23, రంగారెడ్డిలోని 26 ప్రభుత్వ కళాశాలల్లో చాలా వరకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కళాశాలకు నాలుగు చొప్పున బిగించారు. నెల రోజుల నుంచి సాగుతున్న ఈ ఏర్పాటు ప్రక్రియ మరో నాలుగైదు రోజుల్లో ముగియనుంది. కళాశాల ప్రాం గణం, స్టాఫ్ రూంలో ఒకటి చొప్పున, తరగతి గదులలో రెండు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలన్నీ నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డుకు అనుసంధానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, లెక్చరర్ల రాకపోకలపై కన్నేయడంతోపాటు.. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సరైన బోధన అందించడంతోపాటు విద్యార్థులు, లెక్చరర్ల కదలికలు తెలుసుకునేందుకు ఈ చర్యకు శ్రీకారం చుట్టారు. అంతేగాక నగర శివార్లలోని చాలా కళాశాలలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారిన విషయం తెలిసిందే. మద్యం అక్కడే తాగడంతో పాటు కళాశాలలకు సంబంధించిన ఆస్తులను మద్యం మత్తులో ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులు కూడా చోరీకి గురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటే శరణ్యమని భావించిన ప్రభుత్వం.. చర్యలకు ఉపక్రమించింది. గతేడాది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ప్రభుత్వ కళాశాలల్లో కెమెరాలు బిగించారు. ఒకటి నిజామాబాద్ జిల్లాలోకాగా.. మరొకటి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో మార్పు రావడంతో.. ప్రతి కళాశాలలో ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. జూన్ రెండో వరకు అన్ని కళాశాలల్లో కెమెరాలు అందుబాటులోకి వస్తాయని రంగారెడ్డి జిల్లా ఆర్ఐఓ -2 హన్మంత్ రెడ్డి తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు.. కళాశాలల్లో ఇప్పటి వరకు విద్యార్థుల హాజరును రికార్డుల్లో రోజువారీగా నమోదు చేసేవారు. ఇకపై ఇటువంటి పరిస్థితి కనిపించదు. రికార్డులతో పని లేకుండా వేలి ముద్ర ల (బయోమెట్రిక్) ద్వారా తీసుకోనున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో కళాశాలకు గరిష్టంగా రెండు బయోమెట్రిక్ డి వైస్‌లు ప్రభుత్వం నుంచి అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులతోపాటు లెక్చరర్లు కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం పెంచడంతోపాటు.. లెక్చరర్ల రాకపోకల సమయాలను తెలుసుకునేందుకు ఈ చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. జూన్ ఒకటో తేదీ నాటికి బయోమెట్రిక్ మిషన్లను కళాశాలల్లో అందుబాటులోకి రానున్నాయి. -
ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇంటర్ విద్య కమిషనర్ డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 1 నుంచి 30 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 7లోగా తమ వెబ్సైట్లో (www.bietelan gana.cgg.gov.in) పేర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ‘భోజనం’
సర్కార్ యోచన: చక్రపాణి విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు: హరగోపాల్ షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నతవిద్య చదివేందుకు ఈ నిర్ణ యం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతలు సాయంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆచార్య హరగోపాల్‌తో కలసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం హర్షణీయమని చక్రపాణి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చాలామంది పేద బాలికలు పదో తరగతితోనే విద్యను ఆపివేయ డం బాధాకరమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉన్నత విద్య చదవాలని కోరారు. హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యను డబ్బుతో ముడిపెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నాణ్యమైనవిద్యను అందిస్తూ ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వహించాలన్నారు. -
ఇంటర్ ప్రవేశాల్లో సిక్కోలు రికార్డు!
శ్రీకాకుళం న్యూకాలనీ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావొస్తోంది. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 2015-16 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు ప్రథమ సంవత్సరంలో 11,200 మందికి ప్రవేశాలు కల్పించి రాష్ట్రంలోనే సర్కారీ కళాశాలల్లో అత్యధికంగా అడ్మిషన్లు నమోదు చేసిన జిల్లాగా శ్రీకాకుళం రికార్డులకెక్కింది. ఇందులో జనరల్ 9800 మందికాగా ఒకేషనల్ మరో 1400 మంది ఉండటం గమనార్హం. ఇంత భారీగా అడ్మిషన్ల నమోదుకు ఆ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవేనని ఇంటర్ విద్య డీవీఈవో పాత్రుని పాపారావు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కోట్లాది రూపాయలతో నిర్వహిస్తున్న పనులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, అధ్యాపకుల కొరత, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై తన కార్యాలయం లో ఆదివారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. పాఠ్య పుస్తకాల పంపిణీ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు 1.13వేల పాఠ్య పుస్తకాలను తెప్పించాం. దాదాపు 80 శాతం మేర పంపిణీ చేశాం. మరికొన్ని పంపిణీ కావాల్సి ఉంది. ఐఆర్‌డీఎఫ్ పథకం కింద నిధులతో.. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఐఆర్‌డీఎఫ్) పథకంలో భాగంగా నాబార్డ్స్కీమ్-18లో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఎల్.ఎన్.పేట జూనియర్ కళాశాలకు రూ.1.15లక్షలు, కొయ్యాం జూనియర్ కళాశాలకు రూ.1.15 లక్షల సాధారణ నిధులతో ఇప్పటికే పూర్తిస్థాయిలో భవనాలను నిర్మించాం. నాబార్డ్-19 స్కీమ్ కింద ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, పొందూరు, వంగర, మెళియాపుట్టి (ఎనిమిది) కళాశాలల్లో రూ.65 లక్షల చొప్పున అవసరమైన తరగతి గదులు, భవన నిర్మాణ పనులు చేపడుతున్నాం. ఆమదాలవలస పను లు పూర్తయ్యాయి. పలాసలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అన్ని కళాశాలల్లో విద్యాశాఖకు చెందిన ఏపీఈ డబ్ల్యూఐడీసీ ఏజెన్సీ ద్వారా పనులు జరుగుతున్నాయి. నాబార్డ్-20 స్కీమ్ కింద రూ.2.30 లక్షలతో పాలకొండ బాలుర జూనియర్ కళాశాలలో పనులు ప్రారంభంకావాల్సి ఉంది. కొత్తూరు కళాశాలకు ఐటీడీఏ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.1.25 లక్షల పనులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇచ్ఛాపురం కళాశాల అక్కడి ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తోంది. సొంత భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోంది. ప్రతిపాదనలు పంపించాం. మౌలిక సదుపాయాలపై.. అన్ని కళాశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. మరుగుదొడ్లు లేని కళాశాలల జాబితాను ఇంటరు బోర్డుకు పంపించాం. త్వరలో మరిన్ని నిధులు విడుదలకానున్నాయి. నాబార్డ్-19 స్కీమ్ కింద మంజూరైన 8 కళాశాలలకు ఒక్కో కళాశాలకు రూ.4 లక్షల విలువైన ఫర్నిచర్, పరికరాలు వచ్చాయి. పంపిణీకి ఏర్పాట్లు చేశాం. అధ్యాపకుల కొరతపై... జిల్లాలో 49 జనరల్, 14 ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టుల్లో అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది విశ్రాంత అధ్యాపకులతో క్లాసులు చెప్పించాం. ప్రభుత్వం ఈ ఏడాదికి ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. వివిధ సబ్జెక్టుల్లో జిల్లా సగటు ఉత్తీర్ణత శాతంతో సరిపోల్చి కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్స్‌ను కొనసాగిస్తాం. సర్కారీ కళాశాలల్లో ఇంటర్ విద్య బలోపేతానికి, మెరుగైన ఫలితాల సాధనకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమిష్టిగా కృషిచేయాలి. -
కాలేజీల్లో వసతులకు నిధులు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పక్కా సదుపాయాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాలు లేక, సరిపడా తరగతి గదులులేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 465 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే.. మొదట265 కాలేజీల్లో వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. ఇందులో 9 జిల్లాల్లోని 177 కాలేజీల్లో మరుగుదొడ్లు, నీటి శుద్ధి కేంద్రాలు, 69 కాలేజీల్లో అదనపు తరగతి గదులు, 19 కాలేజీల్లో ప్రహరీగోడలు, ఇతర సదుపాయాలను కల్పించనుంది. ఈ మేరకు రూ. 82.25 కోట్లతో ఈ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం నిధులు మం జూరు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. నాబార్డు ఆర్థిక సహకారంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మంచి రోజులు వచ్చినట్లేనని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అలాగే ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారిస్తే విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. -
కాస్త మెరుగు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది 25,320 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 13,330 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లావ్యాప్తంగా బాలికలదే పైచేయిగా నిలిచింది. 12,512 మంది బాలురు పరీక్షలు రాయగా 5,864 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 47 శాతంగా నమోదయ్యింది. బాలికలు 12,808 మంది పరీక్షలకు హాజరుకాగా 7,466 మంది ఉత్తీర్ణత సాధించారు. 58 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో జిల్లావ్యాప్తంగా 1,621 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 846 మంది పాసయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ విభాగంలో గత ఏడాది 14 శాతమే ఉత్తీర్ణులవడం గమనార్హం. ఈ విభాగంలోనూ బాలికలదే పైచేయి. బాలురు 1,075 మంది పరీక్షలు రాయగా 479 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 45 శాతం నమోదయ్యింది. బాలికలు 546 మంది పరీక్షలు రాయగా 366 మంది ఉత్తీర్ణులయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత ఏడాది 55 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ప్రస్తుతం 62.64 శాతం ఉత్తీర్ణులయ్యారు.