నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది 25,320 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 13,330 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లావ్యాప్తంగా బాలికలదే పైచేయిగా నిలిచింది. 12,512 మంది బాలురు పరీక్షలు రాయగా 5,864 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 47 శాతంగా నమోదయ్యింది. బాలికలు 12,808 మంది పరీక్షలకు హాజరుకాగా 7,466 మంది ఉత్తీర్ణత సాధించారు. 58 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఒకేషనల్ విభాగంలో జిల్లావ్యాప్తంగా 1,621 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 846 మంది పాసయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ విభాగంలో గత ఏడాది 14 శాతమే ఉత్తీర్ణులవడం గమనార్హం. ఈ విభాగంలోనూ బాలికలదే పైచేయి. బాలురు 1,075 మంది పరీక్షలు రాయగా 479 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 45 శాతం నమోదయ్యింది. బాలికలు 546 మంది పరీక్షలు రాయగా 366 మంది ఉత్తీర్ణులయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత ఏడాది 55 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ప్రస్తుతం 62.64 శాతం ఉత్తీర్ణులయ్యారు.
కాస్త మెరుగు
Published Sun, May 4 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement