హైదరాబాద్ : మైలార్దేవ్‌పల్లిలో పేకాట స్థావరాలపై బుధవారం పోలీసులు దాడి చేశారు. 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైలార్ దేవ్‌పల్లిలో పేకాట స్థావరాలపై స్థానికులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దాడి చేశారు.