సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రజలకవసరమైన రోడ్డు పనులు జరుగకుండా చేస్తున్నారని జీహెచ్‌ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన శుక్రవారం గవర్నర్‌కు ఫిర్యాదు లేఖ రాశారు. శేరిలింగంపల్లి- బాంబే హైవేకు లింక్‌రోడ్డుగా మజీద్‌బండ రోడ్డు నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలున్నా, కమిషనర్ ఆపనులు చేపట్టడం లేదన్నారు. సదరు రోడ్డు చంద్రబాబునాయుడి ఇంటికి దారి తీస్తున్నందునే రోడ్డు పనులు చేయడంలేదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మన్నన పొందేందుకు ఆయన ఈ రోడ్డు పనులు చేపట్టడం లేదన్నారు. ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ, తెలంగాణలోనే ఉండాలనుకుంటున్న కమిషనర్.. ముఖ్యమంత్రి మన్నన పొందేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకవసరమైన రోడ్డును రాజకీయ కారణాలతో వేయకపోవడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై గవర్నర్‌కు లేఖ
Published Sun, Nov 16 2014 1:34 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement