'అందరి సమన్వయంతో నగరాభివృద్ధి' | ghmc commissioner speaks over hyderabad development | Sakshi
Sakshi News home page

'అందరి సమన్వయంతో నగరాభివృద్ధి'

Published Fri, Jan 1 2016 7:06 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

'అందరి సమన్వయంతో నగరాభివృద్ధి' - Sakshi

'అందరి సమన్వయంతో నగరాభివృద్ధి'

హైదరాబాద్: హైదరాబాద్లాంటి మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ బి.జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం పలువురు సీనియర్ అధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలకు మేలైన సదుపాయాలు అందించగలుగుతామని అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరంలో నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన అన్నారు. కమిషనర్‌ను కలిసినవారిలో ఐఏఎస్ అధికారులు సురేంద్రమోహన్, గౌరవ్‌ఉప్పల్, శివకుమార్ నాయుడు, హరిచందన, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, రవికిరణ్, శంకరయ్య, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement