జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు | GHMC employees For Health cards | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు

Published Wed, Oct 22 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు

సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీహెచ్‌ఎంసీలోని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులు జారీ చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్‌కు ఈ విషయాన్ని తెలిపారు. హెల్త్‌కార్డులతోపాటు అర్హులైన వారికి పదోన్నతులు, బదిలీలు కూడా జరిపేందుకు కమిషనర్ హామీ ఇచ్చారని గోపాల్ విలేకరులతో  అన్నారు. త్వరలోనే పీఆర్‌సీ అమలు కూడా జరుగనున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ సర్కారు ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని అన్నారు. హెల్త్‌కార్డులతో నగదు లేకుండానే ఏ ఆస్పత్రిలోనైనా వైద్యచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement