సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైదరాబాద్ వాసి నాగేందర్
సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో నిర్వహించే ఎన్నికల్లో తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలంగాణకు చెందిన ఓ ప్రవాస భారతీయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన చిందం నాగేందర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్లుగా ఆయన లండన్‌లో నివాసముంటున్నారు.
ప్రవాస భారతీయులందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌పై గత ఏడాది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే 50 పేజీల నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈనెల 14న కేసు కోర్టులో విచారణకు రానుండటంతో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
స్వదేశంలో ఓటేసేందుకు అవకాశమివ్వండి
Published Mon, Nov 10 2014 1:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement