homeland
-
గేమ్ ఛేంజర్ కు పోటీగా బాలయ్య, వెంకీ, అజిత్, విక్రమ్...
-
రాణిని దేశానికి రప్పించండి
విదేశీవ్యవహారాల శాఖమంత్రికి ఎంపీ పొంగులేటి వినతి ఖమ్మం: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర రాణి(గీత)ని స్వదేశానికి రప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మస్వరాజ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామా నికి చెందిన జజ్జర గోపమ్మ, కృష్ణయ్య దంపతుల నాలుగో కుమార్తె రాణి తన తల్లితో కలిసి 2006లో క్రీస్తు సభల్లో పాల్గొనేందుకు గుంటూరు వెళ్లి అక్కడే తప్పి పోయిందని మంత్రికి వివరించారు. రాణికి మాటలు రావని, తప్పిపోయే నాటికి ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమేనన్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె పాకిస్తాన్‌లోని కరాచీలో ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిసిందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి సుష్మాస్వరాజ్ పూర్వాపరాలను పరిశీలించి వీలైనంత త్వరగా రాణిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
మాతృభూమిని మర్చిపోవద్దు
రంగారెడ్డిపాలెం(నరసరావుపేటరూరల్): ఉన్నత చదువులు చదివి, ఆర్దికంగా బలపడినా మాతృభూమిని మాత్రం మర్చిపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని రంగారెడ్డిపాలెంలో మాతృభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన గోల్కొండ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డితో కలిసి పాల్గొని ముఖ్యఅతిధిగా మాట్లాడారు. పదేళ్ళ నుంచి వరుసగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్న రంగారెడ్డిపాలెం ప్రజలను ఆయన అభినందించారు. చనిపోయే వరకు తాను జగన్మోహన్రెడ్డి వెంటనే నడుస్తానని చెప్పారు. గోల్కొండ హోటల్ అధినేత నడికట్టు రామిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి ఆర్ధికంగా బలపడిన వారందరూ తాము పుట్టిపెరిగిన గ్రామాలను అభివృద్ది చేయాలని సూచించారు. తొలుత గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి, నడికట్టు రామిరెడ్డిలకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో వైఎస్సార్, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు అధ్యక్షుడు దొండేటి అచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్, ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, గ్రామసర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి, ఎంపీటీసీ పోతిరెడ్డి శివారెడ్డి, ఉపసర్పంచ్ నల్లగంగుల యజ్ఞారెడ్డి, ఎమ్మెల్యే అధికార ప్రతినిది కొమ్మనబోయిన శంకరయాదవ్, ఎస్సీసెల్ సెల్ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, మాతృసేవా చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మెట్టు అంజిరెడ్డి, గ్రామనాయకులు మూరే రవీంద్రరెడ్డి, యేరువ చంద్రమౌళిరెడ్డి, హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కారులో 12 కోట్లు..
నోయిడా చీఫ్ ఇంజనీర్ యాదవ్‌సింగ్ ఇంటిపై ఐటీ దాడులు ⇒ భారీగా బయటపడిన అక్రమ ఆస్తులు ⇒ ఇంటివద్ద పార్క్ చేసిన కారులో 12 కోట్ల నగదు ⇒ ఇంట్లో 12 లక్షల నగదు, రెండు కిలోల బంగారు, వజ్రాభరణాలు ⇒ 13 బ్యాంకు లాకర్లను సీజ్ చేసిన అధికారులు.. ⇒ 20 చోట్ల 130 మంది అధికారులతో తనిఖీలు.. కొనసాగుతున్న దాడులు ⇒ యాదవ్‌ను బాధ్యతల నుంచి తప్పించిన యూపీ సర్కారు లక్నో/నోయిడా: విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో... స్వదేశంలోనే ఓ భారీ నల్లధన ‘అవినీతి’ చేప ఆదాయ పన్ను శాఖకు చిక్కింది. కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అంతేకాదు వారి సంబంధీకుల వద్దా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు బయటపడ్డాయి.. ఈ ‘అవినీతి’ చేప దొరికింది దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఉండే నోయిడాలో కావడం గమనార్హం. నోయిడా, గ్రేటర్ నోయిడా చీఫ్ ఇంజనీర్ యాదవ్ సింగ్ నివాసంతో పాటు ఆయన భార్య కుసుమ్ లత, స్నేహితుల ఇళ్లపై, వారికి సంబంధించి పలు కంపెనీలపై గురు, శుక్రవారాల్లో ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడుల సందర్భంగా యాదవ్‌సింగ్ ఇంటిపై చేసిన దాడిలో రూ. 12 లక్షల నగదును, రూ. కోట్ల విలువైన దాదాపు రెండు కిలోల బంగారు, వజ్రాభరణాలను అధికారులు గుర్తించారు. ఆయన సన్నిహితుడు రాజేంద్ర మనోచా ఇంట్లో దాడుల సందర్భంగా ఒక సోఫా కింద ఓ వాహనం తాళం చెవిని ఐటీ అధికారులు గుర్తించారు. దానిని ఇంటి బయట పార్క్ చేసి ఉన్న ఒక పెద్ద కారు తాళంచెవిగా గుర్తించి.. వెళ్లి చూసిన అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ కారులోని సీట్ల కింద రూ. 12 కోట్లు నగదు బయటపడింది. యాదవ్ భార్య మాజీ డెరైక్టర్‌గా ఉన్న కంపెనీ మెక్కన్ ఇఫ్రా లిమిటెడ్‌కు రాజేంద్ర మనోచా ప్రస్తుతం డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక యాదవ్ భార్య కుసుమ్ లతకు చెందిన మీను క్రియేషన్స్ సంస్థలో భాగస్వామిగా ఉన్న అనిల్ పెషావరి ఇంటిపై చేసిన దాడిలో రూ. 40 లక్షల నగదును, ఖాతాల్లో చూపని రూ. 12.5 కోట్ల విలువైన స్టాక్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవేగాకుండా యాదవ్‌కు చెందిన 13 బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు. బాధ్యతల నుంచి తప్పించిన యూపీ.. ఐటీ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించిన నేపథ్యంలో.. యాదవ్ సింగ్‌ను చీఫ్ ఇంజనీర్ బాధ్యతల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పించింది. ఆయనను నొయిడా సిబ్బంది వ్యవహారాలశాఖకు అటాచ్ చేసినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఐటీ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని చెప్పారు. 20 చోట్ల 130 మందితో దాడులు..కాంట్రాక్టుల కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా తాము ఈ దాడులు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ డెరైక్టర్ జనరల్ (దర్యాప్తు విభాగం) కృష్ణై సెనీ చెప్పారు. నొయిడా, ఘజియాబాద్, ఢిల్లీల్లో యాదవ్‌తో పాటు ఆయన సంబంధీకులు, పలు సంస్థలకు చెందిన 20 చోట్ల 130 మంది అధికారులతో దాడులు జరిపామని.. ఇంకా దాడులు కొనసాగుతాయని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 30 కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, నోయిడా అధికారుల నుంచి పలు పత్రాలను సేకరించాల్సి ఉందని సైనీ తెలిపారు. కాగా.. యాదవ్ ప్రతి కాంట్రాక్టులో ఐదు శాతాన్ని కమిషన్‌గా తీసుకుంటారని సమాచారం అందినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఆయన భార్య కుసుమ్ లత పేరుమీద దాదాపు 40 నకిలీ కంపెనీలను నడిపిస్తున్నట్లుగా గుర్తించామని.. యాదవ్ తన అధికారాన్ని ఉపయోగించి పలు కంపెనీల పేరిట తక్కువ ధరలకు భూములను కొని ఎక్కువ ధరకు అమ్మేవారని పేర్కొన్నాయి. మాయావతికి సన్నిహితుడు! ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతికి సన్నిహితుడిగా యాదవ్సింగ్కు పేరుంది. ఆమె ప్రభుత్వంలో ఆయన నోయిడాలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటికీ ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టుల కుంభకోణం నేపథ్యంలో.. 2012లో యాదవ్ సింగ్ సస్పెండయ్యారు. ఆ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి టెండర్లు పిలవకుండానే.. కేవలం ఎనిమిది రోజుల్లో రూ. 954 కోట్ల విలువైన కాంట్రాక్టులను యాదవ్ సింగ్ కట్టబెట్టడం గమనార్హం. కానీ చిత్రంగా గత పదిహేను రోజుల కిందే.. తిరిగి నియామకం అయ్యారు. ఈ సారి నోయిడా, గ్రేటర్ నొయిడాలతో పాటు యమునా ఎక్స్‌ప్రెస్‌వే చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కూడా అప్పగించడం గమనార్హం. -
స్వదేశంలో ఓటేసేందుకు అవకాశమివ్వండి
సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైదరాబాద్ వాసి నాగేందర్ సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో నిర్వహించే ఎన్నికల్లో తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలంగాణకు చెందిన ఓ ప్రవాస భారతీయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన చిందం నాగేందర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్లుగా ఆయన లండన్‌లో నివాసముంటున్నారు. ప్రవాస భారతీయులందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌పై గత ఏడాది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే 50 పేజీల నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈనెల 14న కేసు కోర్టులో విచారణకు రానుండటంతో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
కొడవ’కు స్వయం ప్రతిపత్తి కల్పించండి
సాక్షి, బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో కర్ణాటకలోని కొడుగు ప్రాంతాన్ని సైతం స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు కొడవ నేషనల్ కౌన్సిల్(సీఎన్సీ) ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎన్.యూ.నాచప్ప కొడవ మాట్లాడుతూ... కొడుగు ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత వాసులకు ఒక ప్రత్యేక వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయని, వాటిని రక్షించుకోవడానికే తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. భాషా, సంస్కృతిల పరంగా కొడగును అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340,342 ల ప్రకారం కొడగు ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రస్తుతం కొడవ వర్గానికి చెందిన ప్రజల సంఖ్య లక్షా యాభైవేలు మాత్రమేనని అందువల్ల తమను కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 331ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చినట్లుగా రాజకీయాల్లో రిజర్వేషన్‌ను కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ఇదే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటి పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 15న కొడగులో ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. అనంతరం ఈనెల 18న నగరంలోని టౌన్‌హాల్ ఎదుట ధర్నాను నిర్వహిస్తామని, అంతేకాక నవంబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొడవ వర్గానికి చెందిన ఐదు వేల మందితో భారీ ర్యాలీని సైతం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.