హైదరాబాద్: గోల్డ్ మానిటైజేషన్ పథకంలోకి శ్రీవారి బంగారాన్ని తీసుకురానున్నారు. మొత్తం 7.5 టన్నుల బంగారాన్ని ఈ స్కీంలో పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1.3 టన్నుల బంగారాన్ని టీటీడీ ఉంచింది. వివిధ పథకాల కింద నిల్వ ఉంచిన బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకం కిందకి తీసుకురావాలని ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది.
ఇలా చేయడం వల్ల వడ్డీ రూపంలో మరికొంత బంగారం వస్తుందని టీటీడీ బోర్డు భావిస్తోంది. అయితే వడ్డీని బంగారం రూపంలో చెల్లించాలని బోర్డు కోరనుంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రూపాల్లో బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో వినియోగంలోకి తీసుకరానున్నారు.
7.5 టన్నుల బంగారం గోల్డ్ మానిటైజేషన్ లోకి...
Published Sat, Apr 30 2016 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement