ఆరోగ్యశ్రీ ద్వారా అవయవ మార్పిడి | Govt to bring organ transplants under Aarogyasri scheme | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ద్వారా అవయవ మార్పిడి

Published Mon, Aug 15 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ఆరోగ్యశ్రీ ద్వారా అవయవ మార్పిడి

ఆరోగ్యశ్రీ ద్వారా అవయవ మార్పిడి

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకంలో ఇక నుంచి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను కూడా నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పేదలకు శస్త్రచికిత్సలను ఉచితంగానే నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవ మార్పిడులకు అవకాశం ఇవ్వాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శస్త్రచికిత్సలు నిర్వహించే ఆస్పత్రులకు చెల్లించే ధరలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఖరారు చేశారు. ఆయా అవయవ మార్పిడులకు సుమారు రూ.11 లక్షలకు అటూఇటుగా ధరలను నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ఆమోదిస్తే వచ్చే వారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement