
గ్రేడ్–2 ఏఈవో పరీక్ష ఫలితాలు వెల్లడి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 1,311 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ – గ్రేడ్–2 (ఏఈవో) పోస్టులకు రెండు దఫాలుగా నిర్వహించిన రాత పరీక్షల్లో ఎంపికైన 1,258 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. వాటి ఫలితాలను సోమవారం విడుదల చేసింది. పోస్టులకు ఎంపికైన వారి రిజిస్టర్డ్ నంబర్లను తమ వెబ్‌సైట్‌లో చూడవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. 2015 డిసెంబర్ 30న 311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్‌సీ 31 నుంచి 2016 జనవరి 25 వరకు దరఖాస్తులను స్వీకరించింది. మార్చి 13వ తేదీన రాత పరీక్షలను నిర్వహించింది. అలాగే మరో 1,000 పోస్టులకు 2016 ఏప్రిల్ 30న నోటిఫికేషన్ జారీ చేసి, మే 4 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది.
వాటికి జూన్ 4వ తేదీన రాత పరీక్షలను నిర్వహించింది. ఏ నోటిఫికేషన్ ద్వారా ఎవరెవరు పోస్టులకు ఎంపికయ్యా రన్న వివరాలను పాత జిల్లాల వారీగా తమ వెబ్‌సైట్‌లో (tspsc.gov.in) అందు బాటులో ఉంచింది. 2015 డిసెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 311 పోస్టులకు 283 మందిని ఎంపిక చేయగా, 2016 ఏప్రిల్‌లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 1000 పోస్టులకు 975 మందిని ఎంపిక చేసింది. 311 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు 5034 దరఖాస్తు చేసుకోగా, 3824 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే వెయ్యి పోస్టుల భర్తీకి 2016 ఏప్రిల్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు 7645 మంది దరఖాస్తు చేసుకోగా, 6479 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 53 పోస్టులను భర్తీ చేయలేదు.