
హరీశ్ కు ‘గ్రేటర్ వరంగల్’ బాధ్యత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం రాత్రి తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.
ఆదివారం నుంచి ఎన్నికల తంతు ముగిసే వరకు వరంగల్‌లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని హరీశ్ ను ఆయన ఆదేశించారు. ఇప్పటికే వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించిన హరీశ్‌రావుకు తాజాగా అభ్యర్థులను గె లిపించే బాధ్యత కూడా అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు ఆనందం వ ్యక్తం చేస్తున్నాయి.