నేడు హర్తాళ్
- ఏపీ, తెలంగాణలో హర్తాళ్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపు
- జనం కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
- అత్యవసర సేవలు,బ్యాంకులకు మినహాయింపు!
సాక్షి నెట్‌వర్క్: జనం ‘నోట్ల’ కష్టాలను కేంద్రం దృష్టికి తెచ్చి, సమస్యను పరిష్కరించే దిశగా ఒత్తిడి పెంచేందుకు వామపక్షాలు, ఇతర పక్షాల పిలుపు మేరకు సోమవారం తెలంగాణ, ఏపీల్లోనూ హర్తాళ్ జరగనుంది. దీన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునిచ్చారుు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ హర్తాళ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని తమ పార్టీ శ్రేణులకు సూచించింది. అత్యవసర సేవలను, బ్యాంకులను హర్తాళ్ నుంచి మినహారుుంచినట్టు వామపక్ష సంఘటన తెలిపింది.
కొనసాగుతున్న నగదు కష్టాలు
రూ.500, 1,000 నోట్లు రద్దరుు మూడు వారాలు దాటుతున్నా సామాన్య జనం ఇప్పటికీ నగదు కోసం అగచాట్లు పడుతున్నారు. నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ఎటు చూసినా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారుు. వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేలై పోవడంతో చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బ్యాంకు ఖాతాల నుంచి తీసుకునే నగదుపై ఆంక్షలు విధించడం, నోట్ల మార్పిడిని పూర్తిగా నిలిపివేస్తూ డిపాజిట్లను మాత్రమే అనుమతించడం వంటి ఆంక్షలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు సంకల్పించారుు. 28న దేశవ్యాప్త హర్తాళ్‌కు పిలుపునిచ్చారుు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ హర్తాళ్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ముఖ్య నేతలంతా హర్తాళ్‌లో భాగస్వాములవుతారని పార్టీ వర్గాలు తెలిపారుు.
ఏపీలో విజయవంతానికి సన్నాహాలు
సోమవారం తలపెట్టిన హర్తాళ్‌ను విజయవంతం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏపీలో పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం ఉదయం 7 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లదుస్తులు ధరించి శాంతియుతంగా నిరసన తెలపనున్నట్లు చెప్పారు.
భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చంద్రగిరిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు తిరుపతిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. హర్తాళ్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.